ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇంటికో పారిశ్రామికవేత్తే... ప్రభుత్వ లక్ష్యం

ABN, Publish Date - May 08 , 2025 | 11:32 PM

ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంద ని జమ్మలమడుగు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ సి.ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి

ప్రభుత్వ పథకాలతో ఆర్థికంగా ఎదగాలి : ఎమ్మెల్యే ఆది

94.19 ఎకరాల్లో పారిశ్రామిక వాడ ఎస్సీలకు 75శాతంతో భూ కేటాయింపు

ఎర్రగుంట్ల, మే 8(ఆంధ్రజ్యోతి): ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంద ని జమ్మలమడుగు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ సి.ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. ప్రభు త్వం ఇచ్చే సబ్సీడీలను సద్వినియోగం చేసు కుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆ యన పిలుపునిచ్చారు. గురువారం జమ్మల మడుగు నియోజవర్గానికి సంబంధించిన ఎంఎస్‌ఎంఈని ఎర్రగుంట్ల మండలంలోని సుంకేసుల గ్రామ పరిధిలో టీడీపీ నియోజ వర్గ ఇనచార్జి సి.భూపేష్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ మే 1న సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రారంభిం చారన్నారు. అలాగే నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక వాడను ప్రారంభించి ఇంటికో పారిశ్రామిక వేత్తను తయారు చేయడంలో బాగంగా దీన్ని ప్రారంభించినట్లు తెలిపారు. టీడీపీ జమ్మలమడుగు ఇనచార్జి సి.భూపేష్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధిని మెరుగుప రచాలన్న ధ్యేయంతో ఎంఎస్‌ఎంఈని ప్రారంభించినట్లు తెలిపారు.

94.15 ఎకరాలు కేటాయింపు: ఎర్రగుంట్ల మండలంలోని సుంకేసుల గ్రామంలో ఏర్పాటు చేసిన ఎంఎస్‌ఎంఈకి 94.19 ఎకరాల భూమిని కేటాయించినట్లు జోనల్‌ మేనేజర్‌ శ్రీనివాసమూర్తి తెలిపారు. ఇందులో పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటే ఎస్సీల కు 75శాతం ఉచితంగా భూమి కేటాయిస్తారని ఇతరులకు 50శాతం డబ్బులు కడితే మిగతాది 6నెలల్లో సులభవాయిదాల పద్ధతిలో చెల్లించ వలసిఉంటుందన్నారు. జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం, బద్వేలులో ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మైదుకూరులో, ప్రాద్దుటూరు, కడప నియోజవర్గాల్లో భూమిని కేటాయించిన తర్వాత ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తిప్పలూరు సర్పంచి అంబటి పార్వతమ్మ, మండల ఇనచార్జి మధుసూధనరెడ్డి, ఏపీఐఐసీ డిప్యూటీ జోనల్‌ మేనేజర్‌ కమలాకర్‌, ఏఎంసీ ఛైర్మన నాగరాజు, శివనారాయణరెడ్డి, టీడీపీ మండల కన్వీనర్‌ ఎం.మోహనరెడ్డి, ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2025 | 11:32 PM