ఉద్యోగులు సమయ పాలన పాటించాలి : ఎమ్మెల్యే
ABN, Publish Date - Jun 22 , 2025 | 12:04 AM
ప్రభుత్వ ఉద్యోగులు సమయ పాలన పాటించడంతోపాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పేర్కొన్నారు.
ఎమ్మెల్యేకు వివరాలు తెలుపుతున్న ఎంపీడీవో సూర ్యనారాయణరెడ్డి
ప్రొద్దుటూరు రూరల్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులు సమయ పాలన పాటించడంతోపాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పేర్కొన్నారు. శనివారం ప్రొద్దుటూరు ఎంపీడీవో కార్యాలయం, గోపవరం పంచాయతీ కార్యాలయాలను ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి సిబ్బందితో మాట్లాడి సమస్యలపై వాకబు చేశారు. మండల పరిధిలో జరిగిన వివిధ అభివృద్ధి పనులను ఎంపీడీవో సూర్యనారాయణరెడ్డి ఎమ్మెల్యేకు వివరించారు. గోపవరం పంచాయతీ ప్రగతిని కార్యదర్శి రామకృష్ణ ఎమ్మెల్యేకు వివరించారు.
Updated Date - Jun 22 , 2025 | 12:04 AM