గొడవలు సృష్టిస్తున్న విద్యుత స్తంభాలు
ABN, Publish Date - Mar 15 , 2025 | 12:10 AM
పొలాల్లో విద్యుత్తు స్తంభాలు రైతుల మధ్య తగాదాలు సృష్టిస్తున్నాయి.
దువ్వూరు, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): పొలాల్లో విద్యుత్తు స్తంభాలు రైతుల మధ్య తగాదాలు సృష్టిస్తున్నాయి. విద్యుత్తు శాఖ అధికారులు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. దువ్వూరు మండలంలో ఈ దుస్థితి నెలకొంది. రైతులు నీటి తడులు అందించుకునేందుకు విద్యుత్తు మోటార్లు ఎక్కువ మంది ఏర్పరచుకున్నారు. సాగునీటి లభ్యత ఉంటే రెండు పంటలు పండించుకోవచ్చన్నది రైతుల ఆలోచన. కొందరు భూస్వాములు వారికున్న ఆర్థిక అంగబలంతో సాధారణ రైతులతో తగాదాలకు దిగుతున్నారు. ప్రధానంగా విద్యుత్తు అధికారులు అస్తవ్యస్తంగా ఉన్న స్తంభాల సమస్య నివారించాలని రైతులు కోరుతున్నారు.
విద్యుత ఏఈ ఏమన్నారంటే: మండల విద్యుత శాఖ ఏఈ వీరారెడ్డి మాట్లాడు తూ మండల పరిధిలో విద్యుత్తు స్తంభాలు సరిగాలేని ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామన్నారు. నేలటూరు ఫీడర్ పరిధిలో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. దశలవారీగా రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పొలాల్లో స్తంభాలను, విద్యుత్తు వైర్లను సరిచేస్తామన్నారు.
Updated Date - Mar 15 , 2025 | 12:10 AM