డ్వాక్రా రుణాలకు ముడుపులు అడుగుతున్నారు
ABN, Publish Date - Apr 29 , 2025 | 11:36 PM
ప్రస్తుతం డ్వాక్రా రుణాలకు సిఫారసు చే యమని యానిమేటరును అడిగితే తనకు ముడుపులు ఇస్తేనే చేస్తానని డి మాండ్ చేసిందని పోరుమామిళ్ల చిందా నంద నగర్‌కు చెందిన చామంతి గ్రూపు సభ్యులు ఆరోపించారు.
యానిమేటరుపై ప్రాజెక్టు డైరెక్టర్‌కు ఫిర్యాదు
పోరుమామిళ్ల, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి) : ప్రస్తుతం డ్వాక్రా రుణాలకు సిఫారసు చే యమని యానిమేటరును అడిగితే తనకు ముడుపులు ఇస్తేనే చేస్తానని డి మాండ్ చేసిందని పోరుమామిళ్ల చిందా నంద నగర్‌కు చెందిన చామంతి గ్రూపు సభ్యులు ఆరోపించారు. ఆమేరకు యాని మేటరుపై జిల్లా ప్రాజెక్టు డైరెక్టరుకు ఫిర్యా దు చేసినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా చామంతి గ్రూపు సభ్యులు మాట్లా డుతూ గత 20 ఏళ్ల నుంచి పొదుపు డబ్బులు బ్యాం కులో కడుతున్నారని, ప్రస్తుతం ఐదు నెలలు అవుతుందని, లోను తీరిపోయి మరలా రుణం కోసం యానిమేటరును అడిగితే రూ.2వేలు ఇస్తారా, రూ.3వేలు ఇస్తారా అని డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు లో పేర్కొన్నట్లు తెలిపారు. కాగా మంగళవారం బ్యాంకు వద్దకు పోయి అధికారులను అడిగితే ఆమె పైలే పెట్టలేదని తెలియజేశారన్నారు. తమకు బ్యాంకు రుణాలు ఇప్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.
Updated Date - Apr 29 , 2025 | 11:36 PM