కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు
ABN, Publish Date - Jul 21 , 2025 | 11:34 PM
కూటమి ప్రభుత్వంలో కోడూరు నియోజకవర్గం అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందని కుడా చైర్మన ముక్కా రూపానందరెడ్డి అన్నారు.
కుడా చైర్మన ముక్కా రూపానందరెడ్డి
రైల్వేకోడూరు రూరల్, జూలై 21(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంలో కోడూరు నియోజకవర్గం అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందని కుడా చైర్మన ముక్కా రూపానందరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని ఒంటెల సిద్ధయ్య కాంప్లెక్స్ వద్ద రూ.26 లక్షలతో నిర్మించిన భూగర్భ డ్రైనేజ్, సీసీ రోడ్డును ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం లక్ష్మీనగర్‌లో రూ.20 లక్షలతో నిర్మించిన భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కోడూరు మండలంలో రూ.60 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు తెలి పారు.నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ముందుకు సాగుతున్నామన్నారు. త్వరలో కోడూరు పట్టణంలోని ప్రతి వీధిలో భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన పగడాల వరలక్ష్మి, జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, మైసూరివారిపల్లి సర్పంచ సంయుక్త, పోతురాజు నవీన, నార్జాల హేమరాజ్, టీడీపీ మైనారిటీ సీనియర్ నాయకులు పఠాన మౌలా, షేక్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 21 , 2025 | 11:34 PM