సీఎం సహాయ నిధి పంపిణీ
ABN, Publish Date - Jul 26 , 2025 | 12:00 AM
తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి సీఎం సహాయనిధి చెక్కులను అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయిలోకేశ పంపిణీ చేశారు.
రాజంపేట, జూలై 25 (ఆంధ్రజ్యోతి) : తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి సీఎం సహాయనిధి చెక్కులను అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయిలోకేశ పంపిణీ చేశారు. శుక్రవారం బీము గోపాల్‌రెడ్డి, సింగరాజు జ్ఞానకీర్తనలకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ మాజీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురుందేశ్వరి, తాను కలిసి రాజంపేట పార్లమెంట్ పరిధిలో అనారోగ్యంపాలైన వారి వివరాలను సీఎంకు అందజేయగా సుమారు ఏడుగురికి సీఎం సహాయనిధి చెక్కులు అందించార న్నారు. బీజేపీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణయాదవ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు సునీతానారాయణ, తోట శ్రీనివాసులు, పట్టణ బీజేపీ అద్యక్షులు వీవీ రమణ, రూరల్ అధ్యక్షుడు ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 26 , 2025 | 12:00 AM