రేషన్ అక్రమాలకు చెక్
ABN, Publish Date - Jun 03 , 2025 | 11:26 PM
రాష్ట్ర ప్రభుత్వం రేషనషాపుల్లో అక్రమాల కు చెక్ పె డుతూ జూన 1వ తేదీ నుంచి రేషన బియ్యం పంపిణీకి చర్యలు చేపట్టిన ట్లు జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీ పే ర్కొన్నారు.
పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు ఆర్డీవో సాయిశ్రీ వెల్లడి పలు మండలాల్లో రేషన దుకాణాలను తనిఖీ చేసిన అధికారులు
జమ్మలమడుగు, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం రేషనషాపుల్లో అక్రమాల కు చెక్ పె డుతూ జూన 1వ తేదీ నుంచి రేషన బియ్యం పంపిణీకి చర్యలు చేపట్టిన ట్లు జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీ పే ర్కొన్నారు. ప్రభుత్వం రేషన షాపుల ను తిరిగి ప్రారంభించి నేరుగా బియ్యం పంపీ ణీకి శ్రీకారం చుట్టిందని ఆర్డీవో తెలిపారు. జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని కన్నెలూరు గ్రామంలో 9, 10 వార్డులకు సంబందించిన రేషన్ దుకాణాలను ఆర్డీవో సాయిశ్రీ, తహసీల్దారు శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గతంలో చౌక దుకాణాల్లో తూకాలు తక్కువగా ఇస్తున్నారని అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలుండేవని ప్రభుత్వం అలాంటి వాటిని నియంత్రించేందుకు గట్టి చర్యలు చేపట్టినట్లు ఆర్డీవో తెలిపారు. అక్కడున్న రేషన్ షాపు వద్ద స్థానికులతో ఆర్డీవో మాట్లాడి తూకాలు సక్రమంగా ఉన్నాయా, ఏయే వస్తువులకు ధరలు ఎంత తీసుకుంటున్నారు, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకు న్నారు. అలాగే 65 సంవత్సరాలు దాటిన వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్ద రేషన్ పంపిణీ చేస్తారని ఆర్డీవో తెలిపారు.
మైలవరంలో: రేషన్‌షాపుల్లో ప్రభుత్వం కేటాయించిన ధరలకే లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేయాలని జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీ పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని దొమ్మరనంద్యాల గ్రామంలో రేషన్‌షాపును తనిఖీ చేసి గ్రామంలో 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దకు వెళ్లి రేషన్ బియ్యాన్ని ఆర్డీవో పంపిణీ చేశారు. తహసీల్దారు లక్షి ్మనారాయణ పాల్గొన్నారు.
బ్రహ్మంగారిమఠంలో:బ్రహ్మంగారిమ ఠం మండలంలో 16 రేషనఫాపులను మంగళ వారం రాజంపేట డివిజన ఆర్డీవో చంద్ర మోహన, తహసీల్దారు రాజనరసింహ నరేంద్ర, డిప్యూటీ తహసీల్దారు జాన్సన పరిశీలించారు. బి.మఠం-1, పెద్దిరాజుపల్లె, సౌదరివారిపల్లె, తోట్లపల్లె, దిరసవంచ, నాగిశెట్టిపల్లె గ్రామాల్లోని రేషనషాపును పరిశీలించి అక్కడ ప్రజలకు నిత్యావసర వస్తువులు ఏవిధంగా పంపిణీ చేస్తు న్నారని పరిశీలించారు.
చాపాడులో: మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ చౌక దుకాణాలను తహసీల్దారు రమాకుమారి, డిప్యూటీ తహసీల్దారు కృష్ణారెడ్డి, ఆర్‌ఐ శివశంకర్‌రెడ్డి మంగళవారం తనిఖీచేశారు. అల్లాడుపల్లె, పల్లెవోలు, ఖాదర్‌పల్లె, భద్రిపల్లె, సోమాపురం, పెద్దగురవలూరు, చిన్నగురవలూరు, అనంతపురం, అయ్యవారిపల్లె తదితర గ్రామాల్లోని రేషన్‌షాపులను వారు పరిశీలించారు. 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటలలోపు వారి ఇంటి వద్దకు వెళ్లి డీలర్లు బియ్యం అందజేశారు. 15వ తేదీలోపు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని అధికారులు సూచించారు.
ఖాజీపేటలో: మండలంలోని భూమాయ పల్లె పంచాయతీ పరిధిలోని ముత్తలూరుపాడు రేషనషాపులో సర్పంచ్ వెంకటసుబ్బయ్య లబ్ధిదారులకు రేషన బియ్యం మంగళవారం పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అక్రమ రవాణా అరికట్టేందుకే చౌక దుకాణాల్లో ప్రజలకు అందిస్తుందన్నారు.
పోరుమామిళ్లలో : పోరుమా మిళ్లలోని 2వ షాపు డీలర్ అల్లూరయ్య మంగ ళవా రం బియ్యం అందజేశారు. తన డీలరుషిప్ పరిధిలో 60 ఏళ్లుదాటిన రేషన లబ్ధిదారుల ఇం టి వద్దకే వెళ్లి సరుకుల కోసం వేలి ముద్రలు వేయించుకుని వారికి రేషన అం దేలా చేశారు. కారక్మ్రమంలో వీఆర్వో వెంక టసుబ్బయ్య పాల్గొన్నారు.
Updated Date - Jun 03 , 2025 | 11:26 PM