అభివృద్ధే లక్ష్యంగా చంద్రబాబు పాలన
ABN, Publish Date - Jul 19 , 2025 | 11:51 PM
అభివృద్ధే లక్ష్యంగా ముఖ్య మంత్రి చంద్రబాబు పనిచేస్తు న్నారని జమ్మలమడుగు నియో జకవర్గం టీడీపీ ఇనచార్జి భూపే ష్‌రెడ్డి పేర్కొన్నారు.
ఎర్రగుంట్ల, జూలై 19(ఆంధ్రజ్యో తి): అభివృద్ధే లక్ష్యంగా ముఖ్య మంత్రి చంద్రబాబు పనిచేస్తు న్నారని జమ్మలమడుగు నియో జకవర్గం టీడీపీ ఇనచార్జి భూపే ష్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని పెద్దనపా డు, తుమ్మలపల్లె, వలసపల్లె గ్రా మాల్లో సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం ప్రజల కోసం చేస్తు న్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అభివద్ది, సంక్షేమం రెం డు కళ్లుగా చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారన్నారు. ఇంటిలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం,ఉచిత సిలిండర్లు, ఉచిత గ్యాస్ ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎనడీఏ మండల ఇనచార్జి మధుసూద నరెడ్డి, టీడీపీ మండల కన్వీనర్ ఎం.మోహనరెడ్డి, మాజీ సర్పంచులు బి.శివా రెడ్డి, రామ ఓబుళరెడ్డి, నాయకులు రామక్రిష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Jul 19 , 2025 | 11:51 PM