వేడుకగా ఏరువాక గంగమ్మ తల్లి ఉత్సవాలు
ABN, Publish Date - Jun 29 , 2025 | 11:24 PM
ఎర్రగుంట్లలో వెలసిన ఏరు వాక గంగమ్మ తల్లి 28వ వార్షికో త్సవ వేడుకలను ఆదివారం అ త్యంత వైభవంగా నిర్వహించా రు.
ఎర్రగుంట్ల, జూన 29(ఆంధ్రజ్యో తి): ఎర్రగుంట్లలో వెలసిన ఏరు వాక గంగమ్మ తల్లి 28వ వార్షికో త్సవ వేడుకలను ఆదివారం అ త్యంత వైభవంగా నిర్వహించా రు. ఆలయంలో ఉదయం నుం చి అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చన, కలశస్థాపన, గణపతి పూజ నిర్వహించారు. అనంతరం అమ్మవారిని విశేషం గా అలంకరించారు. వేలాది మంది భక్తులు ఆలయానికి వచ్చి అమ్మ వారిని దర్శిం చుకున్నారు. మహిళా భక్తులు విశేష సంఖ్యలో వచ్చి అమ్మవారిని మొక్కుకున్నారు. మధ్యాహ్నం సుమారు 7వేల మందికి అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. సాయం త్రం అమ్మవారి ఊరేగింపు ఆలయం నుంచి నాలుగురోడ్ల కూడలి వరకు సాగింది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన కోలాటం అందరిని అలరించింది. అమ్మవారి వేషధారణలో చేసిన నాట్యం అందరిని మంత్రముగ్దులని చేసింది. భక్తులకు ఎలాం టి ఇబ్బందులు రాకుండా ఆలయ కమిటీ ఛైర్మన సన్నపురెడ్డిసూర్యనారాయణరెడ్డి ఆధ్వర్వంలో ఏర్పాట్లు ఘనంగా చేశారు.
Updated Date - Jun 29 , 2025 | 11:24 PM