వక్ఫ్ చట్ట సవరణపై అవగాహన అవసరం
ABN, Publish Date - Apr 28 , 2025 | 11:57 PM
వక్ఫ్ చట్టంలో మార్పులపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిలోకేశ, రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమే్‌షనాయుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతుగుంట రమే్‌షనాయుడు పే ర్కొన్నారు.
రాజంపేట, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి) : వక్ఫ్ చట్టంలో మార్పులపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిలోకేశ, రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమే్‌షనాయుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతుగుంట రమే్‌షనాయుడు పే ర్కొన్నారు. సోమవారం పట్టణంలోని తోట కల్యాణ మండపంలో వక్ఫ్ చట్టం 2025 మార్పులపై అవగాహన కా ర్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ చట్టం వక్ఫ్ 1995 ఆస్తుల నిర్వహణలో మార్పులు చేస్తూ వక్ఫ్‌బోర్డు అసాధారణ ఏకపక్ష అధికారాలను కలిగి ఉండేదన్నారు. దీంతో ఈ చట్టం పక్కదారి పడుతోందన్నారు. చట్టంలోని ఆర్టికల్ 40ను తొలగించి సవరించి బోర్డు కఠినమైన అధికారాలకు అడ్డుకట్ట వేశారన్నారు. ఈ చట్ట సవరణ ద్వారా ముస్లిం పేద కుటుంబాల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. బీజేపీ నాయకులు రామచంద్రారెడ్డి, చంద్రమౌళి, ఎల్లంపల్లె ప్రశాంత, ష బ్బీర్ అహ్మద్, పరీద్‌బాబు, మస్తానవల్లీ, అరిగె రాం ప్రసాద్, పిండిబోయిన క్రిష్ణయాదవ్, నరేంద్రరాజు, సురే్‌షరాజు, ప్రభావతి, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Apr 28 , 2025 | 11:57 PM