ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మైండ్‌ మేనేజ్‌మెంట్‌ ఫర్‌ బెటర్‌ ప్యూచర్‌పై అవగాహన సదస్సు

ABN, Publish Date - Jul 21 , 2025 | 11:40 PM

రాజంపేట అన్నమాచార్య విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్‌ ఫైనలియర్‌ చదువుతున్న విద్యార్థులకు మైండ్‌ మేనేజ్‌మెంట్‌ ఫర్‌ బెటర్‌ ప్యూచర్‌ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు.

అవగాహన సదస్సులో పాల్గొన్న ఇంజనీరింగ్‌ విద్యార్థులు

రాజంపేట, జూలై 21 (ఆంధ్రజ్యోతి) : రాజంపేట అన్నమాచార్య విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్‌ ఫైనలియర్‌ చదువుతున్న విద్యార్థులకు మైండ్‌ మేనేజ్‌మెంట్‌ ఫర్‌ బెటర్‌ ప్యూచర్‌ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామకృష్ణ మఠం స్వామి బోధమయానందాజీ మహారాజ్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ మనస్సు నిబద్దతతో నడిపితే జీవిత విజయం సాధ్యమవుతుందన్నారు. జ్ఞానం. నియంత్రణ, ధ్యానం జీవితాన్ని గెలవడానికి మార్గం చూపుతాయని స్ప ష్టంగా వివరించారు. విద్యార్థుల జీవిత పరిపక్వతకు, లక్ష్యసాధనకు మైండ్‌ మేనేజ్‌మెంట్‌ ఎంత అవసరమో ఆకర్షణీయంగా వివరించారు. అనంతరం వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ సాయిబాబారెడ్డి మాట్లాడుతూ ఆధారిత, ఆధ్యాత్మికతతో కూడి వ్యక్తిత్వ వికాస సదస్సులు విద్యార్థుల జీవితాల్లో కీలకంగా మారతాయన్నారు. ప్రిన్సిపల్‌ ఎస్‌ఎంవీ నారాయణ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి అద్బుతమ ఐన భవిష్యత్తును కలిగి ఉండాలంటే ముందు మనస్సును క్రమబద్దీకరించుకోవాలన్నారు. మనసును ఎవరైతే సమర్థంగా నిర్వహిస్తారో వారు జీవితంలో విజేతలవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 21 , 2025 | 11:40 PM