ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అన్నమయ్య జన్మస్థలిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి

ABN, Publish Date - May 09 , 2025 | 11:32 PM

అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాకను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని అన్నమయ్య ప్రాజెక్టు స్పెషల్‌ ఆఫీసర్‌ మేడసాని మోహనను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతుగుంట రమే్‌షనాయుడు, ఉద్దండం సుబ్రమణ్యం, జీకే నాగరాజు కోరారు.

అన్నమయ్య ప్రాజెక్టు అధికారికి వినతిపత్రం అందజేస్తున్న బీజేపీ నాయకులు, గ్రామస్థులు

అన్నమయ్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారికి బీజేపీ నేతల వినతి

రాజంపేట, మే 9 (ఆంధ్రజ్యోతి) : అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాకను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని అన్నమయ్య ప్రాజెక్టు స్పెషల్‌ ఆఫీసర్‌ మేడసాని మోహనను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతుగుంట రమే్‌షనాయుడు, ఉద్దండం సుబ్రమణ్యం, జీకే నాగరాజు కోరారు. 108 అడుగుల అన్నమయ్య విగ్రహం, థీమ్‌పార్కును పరిశీలించడానికి వచ్చిన ఆయన్ను కలిసి సత్కరించారు. అలాగే అన్నమయ్య సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమే్‌షనాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు వై.సురే్‌షరాజు, జవ్వాజి అదృష్టదీపుడు, గ్రామస్థులు ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమలలో అన్నమయ్య ఏర్పాటు చేసిన హుండీలో నుంచి ఒక శాతం ఆయన జన్మస్థలి తాళ్లపాక అభివృద్ధికి నిధులు కేటాయించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నారు. 600 జయంతి ఉత్సవాలకు కేటాయించిన బడ్జెట్‌లో కనీసం 50 శాతం కేటాయిస్తే ఉత్సవాలను ఘనంగా నిర్వహించవచ్చునన్నారు. తాళ్లపాక, ఎంజీపురం, బోయనపల్లె పంచాయతీలను మెగా టౌనషి్‌పగా చేస్తామని 600 జయంతి ఉత్సవాల్లో అప్పటి ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా నేటికి పట్టించుకునేవారు లేరన్నారు. ముఖద్వారం నుంచి తాళ్లపాక గ్రామం వరకు డబుల్‌ రహదారితో పాటు ఉద్యానవనం ఏర్పాటు, మొక్కలు పెంచుతామని చెప్పి ఆ హామీ కలగానే మిగిలిందన్నారు. ఇందుకు స్పందించిన మేడసాని మోహన మాట్లాడుతూ అన్ని సమస్యలపై ఈవో, చైర్మన, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానన్నారు. గతంలో ఏవిదంగా జయంతి, వర్ధంతి ఉత్సవాలు జరిగాయో అదేవిధంగా జరిగేందుకు కృషి చేస్తానని తెలిపారు.

Updated Date - May 09 , 2025 | 11:32 PM