యాప్‌ల భారం తగ్గించాలని అంగన్వాడీల నిరసన
ABN, Publish Date - Jul 21 , 2025 | 11:36 PM
ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు యాప్‌ల భారం తగ్గించాలంటూ సోమవారం నిరసన తెలుపుతూ చిట్వేలి ప్రాజెక్టు సీడీపీవో నిర్మల జ్యోతికి వినతిపత్రం ఇచ్చినట్లు అంగన్వాడీ మండల అధ్యక్షురాలు ఉమామహేశ్వరి, కార్యకర్తలు అన్నపూర్ణమ్మ, అనిత, మహాలక్ష్మిలు తెలిపారు.
పెనగలూరు, జూలై 21 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు యాప్‌ల భారం తగ్గించాలంటూ సోమవారం నిరసన తెలుపుతూ చిట్వేలి ప్రాజెక్టు సీడీపీవో నిర్మల జ్యోతికి వినతిపత్రం ఇచ్చినట్లు అంగన్వాడీ మండల అధ్యక్షురాలు ఉమామహేశ్వరి, కార్యకర్తలు అన్నపూర్ణమ్మ, అనిత, మహాలక్ష్మిలు తెలిపారు. సోమవారం మండలంలోని గర్భవతులు, బాలింతలతో కలిసి చిట్వేలి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో యాప్‌ల భారం తగ్గించాలని ఈ సందర్భంగా కోరారు. గర్భవతులు, బాలింతలు నెలకు నాలుగు సార్లు కేంద్రాలకు రావాలంటే విముకత వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వారు వచ్చిన సమయంలో సిగ్నల్స్ పనిచేయకపోవడంతో గంటల తరబడి వేచి ఉండలేక తమను నిష్టూరంగా మాట్లాడుతున్నారని తెలిపారు. యాప్‌ల విధానంను తొలగించి మాన్యువల్ విధానంలో తమకు విధులు అప్పజెప్పితే పనిభారం సులభంగా ఉంటుందని ఈ సందర్భంగా కోరారు.
Updated Date - Jul 21 , 2025 | 11:36 PM