ఉపాధ్యాయుల కోసం రాజీలేని పోరాటం
ABN, Publish Date - Jul 14 , 2025 | 11:28 PM
ఉపాధ్యాయుల సంక్షేమానికి ఏపీయూఎస్ రాజీలేని పోరాటం చేస్తోందని జిల్లా అధ్యక్షుడు నరసింహులు తెలిపారు.
సుండుపల్లె, జూలై14(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల సంక్షేమానికి ఏపీయూఎస్ రాజీలేని పోరాటం చేస్తోందని జిల్లా అధ్యక్షుడు నరసింహులు తెలిపారు. సోమవారం సుం డుపల్లె మండల కేంద్రంలో ఏపీయూఎస్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నా రు. ఉపాధ్యాయుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్న ట్లు తెలిపారు. ఉపాధ్యాయుల తరపున రాజీలేని పోరాటం చేస్తున్నామన్నారు. సుండుపల్లె మండల అధ్యక్షుడిగా రవీంద్రనాయుడు, ప్రధాన కార్యదర్శిగా నారాయణనాయక్, కోశాధికారిగా చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడిగా రాంమోహన, కార్యదర్శిగా మధుసూదనరావు, మహిళా కన్వీనర్‌గా మునీశ్వరమ్మ, క్రీడా కన్వీనర్‌గా రాధారాణిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వివరించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన రవీంద్రనాయుడు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. బదిలీల్లో అనేక మంది ఉపాధ్యాయులకు పొజిషన ఐడీలు రాక జీతాల కోసం ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
Updated Date - Jul 14 , 2025 | 11:29 PM