ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

‘పది’ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు ఎస్పీ

ABN, Publish Date - Mar 17 , 2025 | 11:20 PM

అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి సోమవారం రాయచోటి పట్టణంలోని నేతాజీ సర్కిల్‌లో గల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను డీఈవో డాక్టర్‌ సుబ్రమణ్యంతో కలిసి తనిఖీ చేశారు.

రాయచోటిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న అదనపు ఎస్పీ, డీఈవో

రాయచోటిటౌన, మార్చి17(ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి సోమవారం రాయచోటి పట్టణంలోని నేతాజీ సర్కిల్‌లో గల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను డీఈవో డాక్టర్‌ సుబ్రమణ్యంతో కలిసి తనిఖీ చేశారు.

అనంతరం మాసాపేట జిల్లా పరిషత హైస్కూల్‌, లక్కిరెడ్డిపల్లె మోడల్‌ స్కూల్‌లో జరుగుతున్న పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు.

విద్యార్థులు సెల్‌ఫోన్లు, స్మార్ట్‌వాచలు, పర్సులు, ఇతర ఎలక్ర్టానిక్‌ వస్తువులను పరీక్షా కేంద్రాల్లోకి తీసుకెళ్లకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేపపట్టారు. పరీక్షా కేంద్రాల్లో, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పరీక్ష ముగిసేంతవరకు జిరాక్స్‌, ప్రింటింగ్‌ సెంటర్లు మూసివేసే విధంగా చర్యలు తీసుకంటున్నారన్నారు. పరీక్షలు కొనసాగుతున్నంతసేపు మొబైల్‌ పెట్రోలింగ్‌ బృందం నిరంతరం పెట్రోలింగ్‌ ముమ్మరంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. పరీక్ష ముగిశాక ప్రశ్నా ప త్రాల తరలింపు, సమాధాన పత్రాలు డిపాజిట్‌ చేయ్యడానికి పటిష్ట ఎస్కార్ట్‌ ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అ వాంఛనీయ సంటనలు జరగకుండా పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా జరగడానికి పోలీసుశాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు.

లక్కిరెడ్డిపల్లి: ఏపీ ఆదర్శ పాఠశాల, జిల్లా పరిషత ఉన్న త పాఠశాల, అలాగే బాలికల పాఠశాలలను అదనపు ఎ్‌సస్పీ వెంకటాద్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద జనం 100 మీటర్ల దూరంలో ఉండాలన్నారు.

Updated Date - Mar 17 , 2025 | 11:20 PM