ప్రజల అవసరాలను కార్యకర్తలు గుర్తించాలి : ముక్కా
ABN, Publish Date - Jul 17 , 2025 | 11:56 PM
ప్రజల అవసరాలను కార్యకర్తలు గుర్తించాలని కుడా చైర్మన ముక్కా రూపానందరెడ్డి కార్యకర్తలను కోరారు.
పెనగలూరు, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : ప్రజల అవసరాలను కార్యకర్తలు గుర్తించాలని కుడా చైర్మన ముక్కా రూపానందరెడ్డి కార్యకర్తలను కోరారు. గురువారం ఆయన కొత్త సింగనమలలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పా ల్గొన్నారు. ఇంటింటికి తిరిగి యేడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాల కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఆయన వెంట బత్తిన వేణుగోపాల్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొత్త బాలక్రిష్ణ, దాసరి దామోదర్‌నాయుడు, కె.సుదర్శనచౌదరి, ఎస్.అమీరుల్లా, కేఎనఆర్ సింగారెడ్డిపల్లె మాజీ సర్పంచ లక్ష్మీనరసయ్య, సింగనమల సర్పంచ ఎర్రి శివయ్య, క్లస్టర్ ఇనచార్జి పుచ్చకాయల రవికుమార్, కె.కళాచంద్ర, ఎం.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 17 , 2025 | 11:56 PM