డబుల్ రిజిష్టర్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
ABN, Publish Date - Jul 18 , 2025 | 12:09 AM
కొత్తపల్లె పంచాయతీ మీనాపు రంలో చల్లా ఎల్లమ్మఅనే మహిళ తనకు సర్వేనెంబరు 271లో 3.60 ఎకరాల భూమి ఉంటే 270లో ఆ భూమి ఉన్నట్లు పెద్ద ఖాసీం సా హెబ్ అనే వ్యక్తికి జీపీ చేయించి మోసం చేసిన వారిపై చర్యలు తీసు కోవాలని కొత్తపల్లె సర్పంచ కొనిరె డ్డి శివచంద్రారెడ్డి ఆరోపించారు.
ప్రొద్దుటూరు, జూలై 17 (ఆంధ్రజ్యో తి) : కొత్తపల్లె పంచాయతీ మీనాపు రంలో చల్లా ఎల్లమ్మఅనే మహిళ తనకు సర్వేనెంబరు 271లో 3.60 ఎకరాల భూమి ఉంటే 270లో ఆ భూమి ఉన్నట్లు పెద్ద ఖాసీం సా హెబ్ అనే వ్యక్తికి జీపీ చేయించి మోసం చేసిన వారిపై చర్యలు తీసు కోవాలని కొత్తపల్లె సర్పంచ కొనిరె డ్డి శివచంద్రారెడ్డి ఆరోపించారు. 270లో ఆ భూమి పెద్ద ఖాసీం సాహెబ్ అనే వ్యక్తికి జీపీ చేయించి తద్వారా 70 మందికి ప్లాట్లు వేసి విక్రయించి సొమ్ముచేసుకొని మోసం చేశారంటూ గురువారం తహసీల్దారు గంగయ్యను ప్లాట్ల యజమానులతో కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా శివచంద్రారెడ్డి మాట్లాడుతూ 271 సర్వేనెంబరులో ఉన్న 3.60 ఎకరాల భూమిని ఆమె తిరిగి 2020 మార్చి 20 న ముగ్గురు వ్యక్తులకు అక్రమంగా డబుల్ రిజిషే్ట్రషన చేయించిందన్నారు. 3.60 ఎకరాల్లో ప్లాట్లు వేసుకోని కొందరు ఇళ్లు కూడా నిర్మించి ఉంటే నేడు వారిపై అక్రమరిజిసే్ట్రషన చేయించుకున్న వారు దౌర్జన్యం చేస్తున్నారన్నారు. 70 మంది ప్లాట్ల యజమానులకుకి రాయించిన దస్తా వేజుల్లో హద్దులను 271 సర్వేనెంబరులో రెవెన్యూ అధికారులు పరిశీలించి భూమి యజమాన్యాన్ని నిర్ణయించాలని కోరారు.
Updated Date - Jul 18 , 2025 | 12:09 AM