ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా ఏడాది పాలన సంబరాలు

ABN, Publish Date - Jun 13 , 2025 | 12:07 AM

రాష్ట్రం లో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ శ్రేణులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు.

ప్రొద్దుటూరులో లింగారెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకుంటున్న నేతలు

సంక్షేమ పాలనతో సాగుతున్న కూటమి ప్రభుత ్వం ఏడాది పాలన సంబరాల్లో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కేక్‌లు కట్‌చేసి వేడుకలు జరుపుకున్న కూటమి నాయకులు

ప్రొద్దుటూరు, జూన 12 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రం లో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ శ్రేణులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. గురువారం కూటమి ప్రజాపాలన ఏడాది పూర్తి అయిన సందర్బంగా స్ధానిక టీడీ పీ కార్యాలయంలో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మాట్లాడుతూ అభివృఽద్ది సంక్షేమం దిశగా కూటమి పాలన ఏడాది కాలంగా విజయవంతంగా ముందుకు సాగుతుందన్నారు. పార్టీలు ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ప్రజా సంక్షేమ పఽథకాలను అమలు చేస్తున్నదన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాకే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి ముందుకు పోతోందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ మున్సిపల్‌ చైర్మన ఆసం రఘురామిరెడ్డి , టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఈవీ సుధాకర్‌ రెడ్డి, మాజీ అధ్యక్షుడు ఘంటశాల వెంకటేశ్వర్లు,మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మెన వైఎస్‌ జబీవుల్లా, మున్సిపల్‌ కౌన్సిల్లర్లు, వంగనూరు మురళీ ధర్‌ రెడ్డి, కుతుబుద్దీన, పోసా భాస్కర్‌, మాజీ సర్పంచ మేకల సుబ్బరామయ్య, కాంట్రాక్టర్‌ నారాయణ రెడ్డి ,దుగ్గిరెడ్డి రఘునాధరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

లింగారెడ్డి ఆధ్వర్యంలో : టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సాయి కుటీర్‌ రోడ్డులోని ఆయన స్వగృహంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది సందర్బంగా కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా లింగారెడ్డి మాట్లాడుతూ సంక్షోభంలో వున్న రాష్ట్రాన్ని ప్రగతి బాటలో పయనించేలా సీఎం చంద్రబాబు శక్తి వంచలేకుండా కృషి చేస్తున్నారన్నారు. డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్‌, మంత్రి నారాలోకేశ ల సారఽథ్యంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పరుగులు తీస్తున్నదన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మల్లెల లక్ష్మీప్రసన్న, మాజీ ఎంపీటీసీ గురివిరెడ్డి, మాజీ కౌన్సిల్లర్‌ రామసంజీవరెడ్డి, గోపవరం మాజీ సర్పంచ అల్లా బకాష్‌, ఆవుల దస్తగిరి, లాయర్‌ గుర్రప్ప, షబ్బీర్‌, టప్పా బాషా పాల్గొన్నారు.

ఆనందోత్సాహాల మధ్య ఏడాది సంబరం

బద్వేలుటౌన, జూన 12 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రం లో కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి ఏడాది పూర్తి అయిన సందర్భంగా బద్వేలు పట్టణం లోని టీడీపీ కార్యాలయంలో గురువారం మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, బద్వేలు నియోజకవర్గ ఇనఙచార్జి రితేష్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆనం దోత్సాహాల మధ్య సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తల మధ్య కేక్‌కట్‌చేసి సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేందంలో ప్రధాని నరేం ద్రమోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డబుల్‌ ఇంజిన సర్కారుతో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడు తోందన్నారు. ఈ సంద ర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్‌, మంత్రి నారా లోకేశకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్‌యార్డు చైర్మన కనుమర్లపూటి ప్రసాద్‌, శివయ్యస్వామి, ఏసి యన డిజిటల్‌ కేబుల్‌ చైర్మన రాగిమాను ప్రతాప్‌కుమార్‌, జహంగీర్‌ బాషా, విజయ్‌, మల్లికార్జునరెడ్డి, నరసింహానా యుడు, సీనియర్‌ న్యాయవాది ప్రసాద్‌, విజయ్‌ కుమార్‌, వెంకటయ్య, వెంకటసుబ్బయ్య, రామ్మోహనరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

జమ్మలమడుగులో: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా గురు వారం ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్రపటానికి కూటమి నాయకులు క్షీరాభిషేకం చేసి కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు , డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఆధ్వర్యంలో అభివృద్ధి పరుగులు పెడుతోం దన్నారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.

ఎర్రగుంట్లలో: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఎర్రగుం ట్లలోని టీడీపీ కార్యాలయంలో కూటమి నాయ కులు, కార్యకర్తలు గురువారం సంబరాలు జరుపుకున్నారు. కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరు పుకున్నారు.ఈసందర్భంగా టీడీపీ టౌన, రూరల్‌ అధ్యక్షులు సంజీ వరెడ్డి, మోహనరెడ్డిలు మా ట్లాడుతూ పింఛన నాలుగువేలకు పెంపు, మూ డు గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ, తల్లికి వందనం కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేపట్టిందన్నా రు. రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యే ఆదినారా యణరెడ్డికి, టీడీపీ ఇనచార్జి భూపేష్‌రెడ్డికి వారు శుభాకాంక్షలు తెలిపారు. పెద్దఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

కొండాపురంలో: ఏడాది కూటమి పాలన సంద ర్భంగా కూటమి నాయకులు స్థానిక టీడీపీ కార్యాలయంలో గురువారం సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబా బు నాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిందన్నా రు. మండల టీడీపీ అధ్యక్షుడు నాగేశ్వర్‌రెడ్డి, నాయకులు శంకర్‌రెడ్డి, పద్మజ, రామసుబ్బారెడ్డి, గోవర్దనరె డ్డి, బుజ్జి, గిరీష్‌ పాల్గొన్నారు.

ముద్దనూరులో:కూటమి ఏడాది పాలనలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని టీడీపీ మండల అధ్యక్షుడు చింతా శివరామిరెడ్డి పేర్కొన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో గురువారం కూటమి ఏడాది పాలన పై కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు.. కార్యక్రమంలో కేశవరెడ్డి ,చంద్ర ఓబులరెడ్డి,నాగేశ్వరరావు, బాబురెడ్డి, ఆది,శ్రీకాంత్‌, మాబు టీడీపీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

చాపాడులో: చాపాడులోని టీడీపీ కార్యాలయంలో గురువారం కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు ఏడాది సందర్భంగా కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. మండల టీడీపీ అధ్యక్షుడు అన్నవరం సుధాకర్‌రెడ్డి,. కేసీకెనాల్‌ ప్రాజెక్టు కమిటీ వైస్‌ఛైర్మన్‌ గురివిరెడ్డి, టీడీపీ నాయకులు ప్రతాప్‌రెడ్డి, నారపురెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, గోసుల వీరారెడ్డి, సుబ్బిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, సుదర్శన్‌, రామ్మోహన్‌, వీరారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2025 | 12:07 AM