2003 ఉపాధ్యాయులకు పాతశిక్షణ అమలు చేయాలి
ABN, Publish Date - May 11 , 2025 | 11:40 PM
రాష్ట్ర ప్రభుత్వం 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత శిక్షణ విదానం అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు.
ప్రొద్దుటూరు టౌన్, మే 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత శిక్షణ విదానం అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉపాధ్యాయ సేవా కేంద్రంలో 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు పాత పెన్షన్ విధానం అమలు కావడంలేదనే సమస్యను ఆయన దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2004 సెప్టెంబరు నాటికి ఉద్యోగాలకు ఎంపికైన వారందరికి పాత పెన్షన్ పథకం వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం మెమో 57ను జారీ చేసిందన్నారు. దీని వలన 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు సీబీఎస్ పరిధిలోకి వచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వ మెమో మేరకు వారికి పాత పెన్షన్ పథకం అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. 2003 డీఎఎస్సీ ఉపాధ్యాయులు ఉదయభాస్కర్, వీరప్రతాప్, సుధాకర్, చాంద్‌బాష, వాసవీ, రామిరెడ్డి, ఇక్బాల్, పుల్లయ్య, రమణయ్య, క్రిష్ణయ్య పాల్గొన్నారు.
Updated Date - May 11 , 2025 | 11:40 PM