AP High Court Judge: గవర్నర్‌తో జస్టిస్ బట్టు దేవానంద్ భేటీ
ABN, Publish Date - Jul 26 , 2025 | 05:23 AM
గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం గవర్నర్ బంగ్లాలో భేటీ అయ్యారు.
28న హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం
అమరావతి, జూలై 25(ఆంధ్రజ్యోతి): గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం గవర్నర్ బంగ్లాలో భేటీ అయ్యారు. మద్రాస్ హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ దేవానంద్ కుటుంబ సభ్యులతో కలిసి గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో జస్టిస్ బట్టు దేవానంద్ సతీమణి పద్మకుమారి, కుమార్తెలు మౌని, కీర్తి ఉన్నారు. సోమవారం ఉదయం 10గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్.. జస్టిస్ దేవానంద్‌తో హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేయించనున్నారు.
Updated Date - Jul 26 , 2025 | 05:26 AM