Court orders: తాడేపల్లి పోలీసు స్టేషన్‌కు కొమ్మినేని
ABN, Publish Date - Aug 01 , 2025 | 05:57 AM
అమరావతి మహిళలపై టీవీ డిబేట్‌లో అసభ్య వాఖ్యలు చేయడంతో నమోదైన కేసులో కోర్టు ఉత్తర్వులు మేరకు జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు...
తాడేపల్లి టౌన్, జూలై 31(ఆంధ్రజ్యోతి): అమరావతి మహిళలపై టీవీ డిబేట్‌లో అసభ్య వాఖ్యలు చేయడంతో నమోదైన కేసులో కోర్టు ఉత్తర్వులు మేరకు జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు గురువారం తాడేపల్లి పోలీసు స్టేషన్‌కు వచ్చి సంతకం చేశారు. అయితే ఆయన నెలకు ఒకసారి తుళ్లూరు పోలీసు స్టేషన్‌కు వెళ్లి సంతకం పెట్టాలని కోర్టు మొదట ఆదేశించింది. తుళ్లూరు వెళ్లేందుకు ఇబ్బందులున్నాయని తాడేపల్లి స్టేషన్‌కు వెళ్లి సంతకం చేసేందుకు అనుమతించాలని కొమ్మినేని కోర్టును అభ్యర్థించారు. కోర్టు అనుమతి ఇవ్వడంతో ఆయన తాడేపల్లి స్టేషన్‌కు వచ్చారు.
Updated Date - Aug 01 , 2025 | 05:57 AM