BJP Leader Bhanuprakash: జగన్ జీవితమంతా ఇక ఓదార్పు యాత్రలే
ABN, Publish Date - Jul 09 , 2025 | 05:53 AM
వైసీపీ అధినేత జగన్‌కు ఇక జీవిత కాలంలో జైత్ర యాత్రలు ఉండవు. ఓదార్పు యాత్రలు చేసుకోవాల్సిందే అని బీజేపీ నేత, టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి
తిరుపతి, జూలై 8(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ అధినేత జగన్‌కు ఇక జీవిత కాలంలో జైత్ర యాత్రలు ఉండవు. ఓదార్పు యాత్రలు చేసుకోవాల్సిందే’ అని బీజేపీ నేత, టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తిరుపతిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మామిడి రైతులను పరామర్శించేందుకు చిత్తూరు జిల్లాకు వస్తున్న జగన్... ఎన్ని రకాల మామిడి పండ్లు ఉన్నాయో, వాటిలో నాలుగు పేర్లయినా తెలుసుకుని రావాలి. అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఏరోజైనా మామిడి రైతుల గురించి మాట్లాడావా?’ అని భానుప్రకాశ్ ప్రశ్నించారు.
Updated Date - Jul 09 , 2025 | 05:55 AM