BJP Vishnukumar Raju: లిక్కర్ స్కామ్‌లో జగన్ లోపలకు వెళ్లడం ఖాయం
ABN, Publish Date - Aug 03 , 2025 | 04:24 AM
లిక్కర్ స్కామ్‌లో మాజీ సీఎం జగన్ త్వరలో లోపలకు వెళ్లడం ఖాయమని విశాఖపట్నం నార్త్ బీజేపీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు అన్నారు.
లెక్కల్ని సీబీఐ, ఈడీ, సిట్ తేలుస్తాయి: విష్ణుకుమార్‌రాజు
గాజువాక (విశాఖపట్నం), ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): లిక్కర్ స్కామ్‌లో మాజీ సీఎం జగన్ త్వరలో లోపలకు వెళ్లడం ఖాయమని విశాఖపట్నం నార్త్ బీజేపీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు అన్నారు. గాజువాక తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో శనివారం నిర్వహించిన ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ వికాస్’ పథకం మొదటి విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘ఇప్పటి వరకూ బయటపడింది లిక్కర్ సరఫరా చేసిన వారిచ్చిన కమీషన్ మాత్రమే. ఇంకా రూ.12 బాటిల్‌ను రూ.200కు అమ్మిన లెక్కలు తేలాల్సి ఉంది. రూ.100 కోట్ల విలువైన మద్యాన్ని నేరుగా ఫ్యాక్టరీ నుంచి తీసుకొని బయట అమ్మితే రూ.2 వేల కోట్లు వస్తుంది. ఆ స్కామ్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలి. అదంతా సీబీఐ, ఈడీ, సిట్ తేలుస్తాయి. రాష్ట్ర పురోభివృద్ధి కోసం రానున్న ఎన్నికల్లో సైతం జగన్‌కు బుద్ధి చెప్పాలి’ అని అన్నారు.
Updated Date - Aug 03 , 2025 | 04:24 AM