ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జగన్‌కు ఏ వ్యవస్థపైనా గౌరవం లేదు: కొలుసు

ABN, Publish Date - Jul 19 , 2025 | 05:46 AM

మాజీ సీఎం జగన్‌కి ఏ వ్యవస్థపైనా గౌర వం లేదు. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు ప్రజాస్వామ్యంపై చేస్తున్న దాడే అని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.

విశాఖపట్నం, జూలై 18(ఆంధ్రజ్యోతి): ‘మాజీ సీఎం జగన్‌కి ఏ వ్యవస్థపైనా గౌర వం లేదు. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు ప్రజాస్వామ్యంపై చేస్తున్న దాడే’ అని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. శుక్రవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో మాట్లాడారు. ‘శాంతిభద్రతలు పరిరక్షించే పోలీసులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం జగన్‌ విచిత్ర మనస్తత్వానికి పరాకాష్ఠ. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను ఆయన భయపెడుతున్నారు. గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసం, పోలవరం తదితర ప్రాజెక్టుల్లో చేసిన తప్పిదాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి జగన్‌ విషం చిమ్ముతున్నారు. రప్పా రప్పా నరికేస్తాం... పొడిచేస్తాం అంటున్నారు. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా జగన్‌ అడ్డుకుంటున్నారు.’ అని మంత్రి పార్థసారథి విమర్శించారు.

Updated Date - Jul 19 , 2025 | 05:46 AM