Minister Anita: నేత ముసుగులో నేరస్థుడు జగన్
ABN, Publish Date - Jul 22 , 2025 | 04:44 AM
మాజీ సీఎం జగన్ రాజకీయ నాయకుడి ముసుగులో ఉన్న నేరస్థుడని హోం మంత్రి వంగలపుడి అనిత అన్నారు.
ఎంపీ అరెస్టు వెనుక రాజకీయ దురుద్దేశం లేదు: అనిత
మడకశిర, ఒంగోలు, తిరుపతి, జూలై 21(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్ రాజకీయ నాయకుడి ముసుగులో ఉన్న నేరస్థుడని హోం మంత్రి వంగలపుడి అనిత అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘జగన్ నేరస్థుడు కాబట్టే ఆయన అండ్ కో కూడా వైసీపీ హయాంలో అక్రమాలు, అవినీతికి పాల్పడింది. రాష్ట్రాన్ని ఐదేళ్లు దోపిడీ చేశారు. వారి అక్రమాలను బయటపెట్టి సాక్ష్యాధారాలతో అరెస్టు చేస్తున్నాం. దాన్ని రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నించడం నీచం. ఒక ఎంపీని ఆధారాలు లేకుండా అరెస్టు చేయడం సాధ్యమా..? ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టు వెనక ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవు. వారు చేసిన అవినీతి, అక్రమాలు బయటపడినా కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగడం వారి నైజం. ఇంత జరుగుతున్నా జగన్ మాత్రం అక్రమార్కులను, మహిళలను విమర్శించే వారినే వెనకేసుకొస్తున్నారు. కోర్టు పరిధిలో ఉన్నందున మిథున్‌రెడ్డి అంశంపై నేను మాట్లాడలేను. అక్రమాలకు పాల్పడినవారు మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని మంత్రి అనిత చెప్పారు.
Updated Date - Jul 22 , 2025 | 04:45 AM