ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బదిలీలకు వేళాయె!

ABN, Publish Date - May 30 , 2025 | 01:06 AM

జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమైంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గురువారం నాటికి దాదాపు పూర్తయింది. వచ్చిన దర ఖాస్తుల్లో ఐదేళ్లుగా ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేసి, మిగిలిన వారిని ఖాళీలను బట్టి బదిలీ చేసేందుకు ఆయా విభాగాల అధికారులు కసరత్తు చేస్తున్నారు. జూన్‌ 1, 2 తేదీల్లో బదిలీల ప్రక్రియను పూర్తి చేసి, జూన్‌ 3వ తేదీన ఉద్యోగులు వారికి కేటాయించిన ప్రాంతాల్లో విధుల్లో చేరేలా ప్రణాళికను రూపొందిస్తున్నారు.

- ప్రభుత్వ శాఖల్లో ముగిసిన బదిలీల దర ఖాస్తుల స్వీకరణ

- జూన్‌ 2వతేదీ నాటికి బదిలీల ప్రక్రియ పూర్తిచేసేలా కసరత్తు

- విద్యాశాఖలో ప్రధానోపాధ్యాయులకు పదోన్నతి కౌన్సెలింగ్‌

- విధుల్లో చేరిన జెడ్పీ సీఈవో.. కౌన్సెలింగ్‌ ద్వారానే బదిలీలని హామీ

- మిగిలిన విభాగాల్లో ఒకటి, రెండు రోజుల్లో పూర్తికానున్న ప్రక్రియ

జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమైంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గురువారం నాటికి దాదాపు పూర్తయింది. వచ్చిన దర ఖాస్తుల్లో ఐదేళ్లుగా ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేసి, మిగిలిన వారిని ఖాళీలను బట్టి బదిలీ చేసేందుకు ఆయా విభాగాల అధికారులు కసరత్తు చేస్తున్నారు. జూన్‌ 1, 2 తేదీల్లో బదిలీల ప్రక్రియను పూర్తి చేసి, జూన్‌ 3వ తేదీన ఉద్యోగులు వారికి కేటాయించిన ప్రాంతాల్లో విధుల్లో చేరేలా ప్రణాళికను రూపొందిస్తున్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం: జిల్లాలోని వివిధ విభాగాల ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఉద్యోగులు బదిలీలకు దరఖాస్తులు చేసుకున్నారు. వాటిని పరిశీలించి ఒకటి, రెండు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఆలస్యంగా హెచ్‌ఎంలకు పదోన్నతి కౌన్సెలింగ్‌

మచిలీపట్నంలోని లేడియాంప్తిల్‌ జూనియర్‌ కళాశాలలో గురువారం ఉమ్మడి జిల్లాల్లోని ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులకు పదోన్నతి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. 393 ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులను కౌన్సెలింగ్‌కు పిలిచారు. ఉదయం 10 గంటలకు పదోన్నతుల కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుందని విద్యాశాఖ అధికారులు ప్రకటించడంతో ఉపాధ్యాయులు ఆ సమయానికి కౌన్సెలింగ్‌ జరిగే కేంద్రానికి చేరుకున్నారు. అయితే ఉపాధ్యాయుల పదోన్నతి కౌన్సెలింగ్‌కు సంబంధించిన కీ వివరాలు విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి రాకపోవడంతో కౌన్సెలింగ్‌ ప్రక్రియ మఽధ్యాహ్నం నుంచి జరుగుతుందని డీఈవో పీవీజే రామారావు ప్రకటించారు. మధ్యాహ్నం నుంచి ప్రధానోపాధ్యాయులు వేచి ఉండగా, గురువారం సాయత్రం 6.30 గంటలకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది, 393 మంది ప్రధానోపాధ్యాయులు కౌన్సెలింగ్‌కు హాజరు కాగా, వారిలో 198 మందికి పదోన్నతులు ఇచ్చారు. ఇటీవల సవరించిన ఎస్సీ రిజర్వేషన్‌ల ప్రకారం ఎనిమిది మంది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రధానోపాధ్యాయులకు పదోన్నతులు కల్పించారు. పదోతరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ కోర్సు వరుసగా చదవలేదనే కారణంతో హిందీ పండిట్‌ ఒకరికి పదోన్నతిని అధికారులు నిలిపివేశారు.

జెడ్పీలో కౌన్సెలింగ్‌ పద్ధతిలోనే బదిలీలు

జిల్లా పరిషతలోని పలు విభాగాల్లో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఇటీవల గందరగోళం నెలకొంది. ఉద్యోగులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకుంటే కౌన్సెలింగ్‌ నిర్వహించి ఉద్యోగులు కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జెడ్పీ ఉద్యోగులకు కౌన్సెలింగ్‌ పద్ధతిలో కాకుండా, నేరుగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని పాలకవర్గ సభ్యులు చెప్పడంతో ఉద్యోగులంతా ఖంగుతిన్నారు. కౌన్సెలింగ్‌ పద్ధతిలోనే బదిలీలు చేయాలని ఇటీవల ఇన్‌చార్జి కలెక్టర్‌, జెడ్పీ ఇన్‌చార్జి సీఈవోను కలసి విన్నవించుకున్నారు. జెడ్పీ సీఈవో కన్నమనాయుడు సెలవులో ఉండటంతో ఈ విభాగంలో జరిగే బదిలీల్లో కొంత గందరగోళం ఏర్పడింది. దీంతో పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయ ఉన్నతాధికారులు స్పందించి జెడ్పీ సీఈవోను వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో జెడ్పీ సీఈవో గురువారం విధుల్లో చేరారు. వచ్చిన వెంటనే ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. బదిలీల అంశంపై వారితో చర్చించారు. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం, కౌన్సెలింగ్‌ పద్ధతిలోనే ఉద్యోగుల బదిలీలు జరుగుతాయని, అందులో సందేహం లేదని సీఈవో స్పష్టం చేశారు. బదిలీల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, ఎంత సమయంలోగా బదిలీల ప్రక్రియను పూర్తి చేస్తామో అంచనాకు వస్తామని, జూన్‌ 1, 2 తేదీల్లో జెడ్పీ ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. జెడ్పీ బదిలీల్లో యూనియన్‌లలో ఆఫీస్‌ బేరర్లుగా ఉన్నవారికి ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు, తదితర అంశాలపై కలెక్టర్‌తో సంప్రదింపులు జరిపి తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా, రెవెన్యూ విభాగంతోపాటు డీపీవో, సాంఘిక, బీసీ సంక్షేమ శాఖల్లో బదిలీల కోసం ఉద్యోగుల చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి, ఒకటి, రెండు రోజుల్లో బదిలీల ప్రక్రియను పూర్తి చేసి కలెక్టర్‌కు సంబంధిత జాబితాలు పంపుతామని ఆయాశాఖల అధికారులు పేర్కొంటున్నారు.

Updated Date - May 30 , 2025 | 01:06 AM