ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యా పండుగకు వేళాయె!

ABN, Publish Date - Jun 25 , 2025 | 01:31 AM

విద్యా పండుగకు కృష్ణా యూనివర్సిటీ ముస్తాబైంది. అంగరంగ వైభవంగా జరిగే స్నాత కోత్సవంలో వివిఽధ రంగాలకు చెందిన ముగ్గురు ప్రముఖులకు డాక్టరేట్‌లు ప్రదానం చేయనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. యూనివర్సిటీలోని సెనెట్‌ హాలులో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్నాతకోత్సవం వివరాలను వీసీ కె.రామ్‌జీ వెల్లడించారు.

- నేడు కృష్ణాయూనివర్సిటీ స్నాతకోత్సవం

- హాజరుకానున్న గవర్నర్‌ నజీర్‌, మంత్రి లోకేశ్‌

- ముగ్గురికి ఇవ్వనున్న డాక్టరేట్‌లు

- 21 మందికి బంగారు పతకాలు, 300 మంది పీజీ విద్యార్థులకు ఇవ్వనున్న సర్టిఫికెట్లు

- మీడియాకు వివరాలు వెల్లడించిన వీసీ రామ్‌జీ

మచిలీపట్నం, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): విద్యా పండుగకు కృష్ణా యూనివర్సిటీ ముస్తాబైంది. అంగరంగ వైభవంగా జరిగే స్నాత కోత్సవంలో వివిఽధ రంగాలకు చెందిన ముగ్గురు ప్రముఖులకు డాక్టరేట్‌లు ప్రదానం చేయనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. యూనివర్సిటీలోని సెనెట్‌ హాలులో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్నాతకోత్సవం వివరాలను వీసీ కె.రామ్‌జీ వెల్లడించారు. బుధ వారం మధ్యాహ్నం గవర్నర్‌ యూనివర్సిటీ చాంబర్‌ సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. ఆ తర్వాత యూనివర్సిటీ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ఫుడ్‌కోర్టు భవనాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. మధ్యాహ్నం 3.00 గంటలకు యూనివర్సిటీలోని అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో స్నాతకోత్సవం ప్రారంభ మవుతుందన్నారు. గవర్నర్‌తో పాటు రాష్ట్ర మానవ వనరులు, ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌, మంత్రి కొల్లు రవీంద్ర, ఇతర ప్రముఖులు హాజరవుతారని వివరించారు.

ముగ్గురు ప్రముఖులకు డాక్టరేట్‌లు!

కృష్ణాజిల్లాకు చెందిన ముగ్గురు ప్రముఖులకు డాక్టరేట్‌లను ప్రదానం చేయనున్నట్లు వీసీ రామ్‌జీ తెలిపారు. 6వ స్నాతకోత్సవంలో భాగంగా ఎన్‌ఎస్‌ఎల్‌ గ్రూప్‌ చైర్మన్‌ మండవ ప్రభాకరరావుకు, 7వ స్నాతకోత్సవంలో భాగంగా అమెరికాలోని అలబామా యూనివర్సిటీలో ట్రాన్షేషన్‌ మెడిసిన్‌ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఎంఎన్‌వీ రవికుమార్‌కు, 8వ స్నాతకోత్సవంలో భాగంగా గ్రీన్‌కో సంస్థ సీఈవో చలమలశెట్టి అనిల్‌కుమార్‌కు డాక్టరేట్‌లను ప్రదానం చేయనున్నట్లు వివరించారు. మండవ ప్రభాకరరావు స్నాతకోత్సవ ప్రసంగం చేస్తారని తెలిపారు. వివిధ కోర్సుల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 21 మందికి బంగారు పతాకాలు, 62 మందికి పీహెచ్‌డీలు, ఇద్దరికి ఎంఫిల్‌ పట్టాలు, 300 మంది పీజీ విద్యార్థులకు సర్టిఫికెట్‌లను అందజేస్తామన్నారు. కలెక్టర్‌ బాలాజీ, జేసీ గీతాంజలి శర్మ, ఎస్పీ ఆర్‌.గంగాధరరావు తదితరుల సహకారంతో ఈ కార్యక్రమానికి పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినట్లు వీసీ తెలిపారు. ఈ విలేకరుల సమాశంలో రిజిస్ర్టార్‌ ఎన్‌.ఉష, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ వీరబ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. కాగా, గవర్నర్‌, మంత్రి పర్యటన సందర్భంగా కలెక్టర్‌ బాలాజీ, జేసీ గీతాంజలిశర్మ, ఎస్పీ ఆర్‌.గంగాధరరావు యూనివర్సిటీలో ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.

గవర్నర్‌, మంత్రి పర్యటన ఇలా..

- రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ బుధవారం మధ్యాహ్నం 2.45 గంటలకు రాజ్‌భవన్‌ నుంచి బయలు దేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు యూనివర్సిటీకి చేరుకుంటారు. 3 గంటల నుంచి 4.45 గంటల వరకు యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. 4.50 గంటలకు వర్సిటీ నుంచి రోడ్డు మార్గం ద్వారా రాజ్‌భవన్‌కు చేరుకుంటారు.

-రాష్ట్ర మానవ వనరులు, ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఉదయం 8.30 గంటలకు మచిలీపట్నంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీకి చేరుకుంటారు. అక్కడ 1.30 గంటల వరకు టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. మఽధ్యాహ్నం 2.30 గంటలకు హౌసింగ్‌ బోర్డు కాలనీ నుంచి బయలుదేరి 2.50 గంటలకు కృష్ణా యూనివర్సిటికీ చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే స్నాతకోత్సవంలో పాల్గొంటారు. 5.30 గంటలకు విజయవాడ బయలుదేరి వెళ్తారు.

Updated Date - Jun 25 , 2025 | 01:31 AM