ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఈ ఏడాది ‘రోహిణి’ లేనట్టే..!

ABN, Publish Date - May 26 , 2025 | 12:59 AM

వేసవి ఉష్ణోగ్రతల నమోదులో అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది రెంటచింతల. ఆ తర్వాత టక్కున చెప్పే పేరు విజయవాడ. ఎండాకాలంలో అన్ని ప్రాంతాలు మండిపోతుంటాయి. కాకపోతే ఈ రెండు ప్రాంతాల్లో మంటలు అన్నింటి కంటే ఎక్కువగా ఉంటాయి. వేసవికాలం రోజులు అడుగు పెట్టడానికి ముందు నుంచి ఉమ్మడి జిల్లాకు సెగ తగులుతుంది. ముఖ్యంగా ఎన్టీఆర్‌ జిల్లా కేంద్రంగా ఉండే విజయవాడ ప్రజలను ఇది ఎక్కువగా తాకుతుంది. సాధారణ రోజుల్లోనే విజయవాడలో ఎండలు కాస్త ఎక్కువగా ఉంటాయి. అదే వేసవిలో నమోదయ్యే ఉష్ణోగ్రతలకు ప్రజలు అల్లాడిపోతుంటారు. ఇక రోహిణి కార్తె ప్రారంభమైతే జనం ఇంటి నుంచి కాలు బయట పెట్టడానికి గడగడలాడిపోతుంటారు. ప్రతి ఏడాది ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజలకు ఇది తప్పని పరిస్థితి. ఈ ఏడాది మాత్రం జిల్లాకు ముందస్తు ఉపశమనం లభించింది. రోహిణి కార్తె మొదలయ్యే రోజు నుంచి అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఇప్పుడు రోహిణి వచ్చిన నాటి నుంచి జిల్లా ప్రజలను చల్లదనంతో చినుకులు పలకరించాయి. ఈ వర్షాల పరంపర జూన్‌ వరకు కొనసాగుతుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.

నెలాఖరు వరకు వరుసగా వర్షాలు

మూడు రోజుల్లో ఉమ్మడి జిల్లాలోకి నైరుతి రుతుపవనాలు

ప్రజలకు ముందస్తు ఉపశమనం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

వేసవి ఉష్ణోగ్రతల నమోదులో అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది రెంటచింతల. ఆ తర్వాత టక్కున చెప్పే పేరు విజయవాడ. ఎండాకాలంలో అన్ని ప్రాంతాలు మండిపోతుంటాయి. కాకపోతే ఈ రెండు ప్రాంతాల్లో మంటలు అన్నింటి కంటే ఎక్కువగా ఉంటాయి. వేసవికాలం రోజులు అడుగు పెట్టడానికి ముందు నుంచి ఉమ్మడి జిల్లాకు సెగ తగులుతుంది. ముఖ్యంగా ఎన్టీఆర్‌ జిల్లా కేంద్రంగా ఉండే విజయవాడ ప్రజలను ఇది ఎక్కువగా తాకుతుంది. సాధారణ రోజుల్లోనే విజయవాడలో ఎండలు కాస్త ఎక్కువగా ఉంటాయి. అదే వేసవిలో నమోదయ్యే ఉష్ణోగ్రతలకు ప్రజలు అల్లాడిపోతుంటారు. ఇక రోహిణి కార్తె ప్రారంభమైతే జనం ఇంటి నుంచి కాలు బయట పెట్టడానికి గడగడలాడిపోతుంటారు. ప్రతి ఏడాది ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజలకు ఇది తప్పని పరిస్థితి. ఈ ఏడాది మాత్రం జిల్లాకు ముందస్తు ఉపశమనం లభించింది. రోహిణి కార్తె మొదలయ్యే రోజు నుంచి అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఇప్పుడు రోహిణి వచ్చిన నాటి నుంచి జిల్లా ప్రజలను చల్లదనంతో చినుకులు పలకరించాయి. ఈ వర్షాల పరంపర జూన్‌ వరకు కొనసాగుతుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.

చాన్నాళ్ల తర్వాత

వేసవి కాలంలో ప్రతి ఏడాది మే నెలలో రోహిణి కార్తె ప్రారంభమవుతుంది. ఇది 15 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ 15 రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వడగాల్పులు విపరీతంగా వీస్తాయి. రాత్రి ఏడెనిమిది గంటల వరకు వేడి గాలులు వీస్తాయి. ఈ రోహిణి కార్తె ఆదివారం నుంచి ప్రారంభమైంది. ఇది జూన్‌ ఎనిమిదో తేదీ వరకు ఉంటుంది. రోహిణి రోజుల్లో జిల్లా మొత్తం నిప్పుల కొలిమిలా మారుతుంది. ఆదివారం ఉదయం నుంచి ఎండ తీవ్రత కనిపించింది. ఈ పరిస్థితి మధ్యాహ్నం రెండు, మూడు గంటల వరకు మాత్రమే ఉంది. ఆ తర్వాత నుంచి వాతావరణంలో మార్పులు వచ్చాయి. ఆకాశం మేఘావృతమై చల్లనిగాలులు వీచాయి. ఒక్కసారిగా వర్షం కురవడం మొదలైంది. సాధారణంగా ప్రతి ఏడాది రోహిణి కార్తె ప్రారంభం నుంచి ఉష్ణోగ్రతలు 42 నుంచి 46 డిగ్రీల వరకు నమోదవుతాయి. వాతావరణ శాఖ రికార్డులు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఈ ఏడాది మాత్రం రోహిణి ప్రభావం ఉమ్మడి కృష్ణా జిల్లాపై పడలేదు. రోహిణి అడుగుపెట్టిన తర్వాత వరుణుడు ఆ వేడిని చల్లార్చడంతో ప్రజలకు ఒక్కసారిగా ఉపశమనం లభించినట్టయింది. ఇలాంటి పరిస్థితి ఇంతకుముందు చాన్నాళ్ల క్రితం చూశామని ప్రజలు చెబుతున్నారు. బంగాళాఖాతం, అరేబియన్‌ సముద్ర గర్భంలో అల్పపీడనం ఏర్పడడంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ వర్షాలు నెలాఖరు వరకు నిరంతరం కురుస్తాయని అంచనా వేశారు. దీనితోడు మరో మూడు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రంలోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు, రుతుపవనాల రాకతో ఉమ్మడి కృష్ణా జిల్లాకు రోహిణి సెగ తప్పినట్టవుతుంది.

గాలుల దిశ మారుతోంది : కె.సత్యనారాయణ, వాతావరణ నిపుణుడు

వేసవిలో ఉత్తర, పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తాయి. ఈ గాలులు రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంతం నుంచి వస్తాయి. దీనివల్ల మనకు వేడి ఎక్కువగా ఉంటుంది. జూన్‌ నెలలో ఈ గాలుల స్థానంలో దక్షిణ, పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తాయి. వాటి వల్ల వాతావరణంలో చల్లదనం చేరుతుంది. ఈ ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయి. సాధారణంగా జూన్‌లో వస్తాయని అంచనా వేసిన రుతుపవనాలు ఈసారి ముందుగానే తెలుగుగడ్డను తాకుతున్నాయి. రుతుపవనాలు వచ్చినప్పుడు ఎలాగూ వర్షాలు కురుస్తాయి. దీనికి ముందు బంగాళాఖాతం, అరేబియ సముద్ర గర్భంలో ఏర్పడిన అల్పపీడనంతో కొన్ని రోజులపాటు వరుసగా ప్రతిరోజు వర్షాలు కురుస్తాయి.

Updated Date - May 26 , 2025 | 12:59 AM