కౌన్సిలర్లకు గౌరవవేతనం ఇవ్వకపోవడం దారుణం
ABN, Publish Date - May 09 , 2025 | 11:51 PM
జమ్మలమడుగు మున్సిపాలిటీ లో కౌన్సిలర్లకు గౌరవం లేదని, గౌరవవేతనం కూడా ఇవ్వకపోవ డం దారుణమని మున్సిపల్ వైస్ చైర్మన-2 సింగరయ్యతోపాటు ప లువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మున్సిపల్ సమావేశంలో సభ్యులతోపాటు వైస్‌చైర్మ,న-2 ఆగ్రహం
జమ్మలమడుగు మే 9 (ఆంధ్రజ్యో తి): జమ్మలమడుగు మున్సిపాలిటీ లో కౌన్సిలర్లకు గౌరవం లేదని, గౌరవవేతనం కూడా ఇవ్వకపోవ డం దారుణమని మున్సిపల్ వైస్ చైర్మన-2 సింగరయ్యతోపాటు ప లువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జమ్మలమడు గు మున్సిపల్ సాధారణ సమావేశం చైర్‌పర్సన శివమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఎక్స్ అఫిసియో సభ్యుడిగా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి స మావేశానికి హాజరయ్యారకు. ముందుగా 142 అంశాలకు సంబంధించిన అజెండాపై చర్చించారు. వెంటనే కన్నెలూరు కౌన్సిలర్ బాణా శివరామలింగారెడ్డి గ్రామంలో మంచి నీటి ట్యాంకు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే అంబవరం ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీలో లబ్ధిదారులకు బిల్లులు రాక అప్పులు చేసుకుని ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యేకు తెలిపారు. సమస్యపై కమిషనర్ స్పందించారు. కాగా మున్సిపాలిటీలో మూడు ప్రాంతాల్లో మంచి నీటి ట్యాంకులు మంజూరు అయ్యాయని, త్వరలో నిర్మిస్తామని నీటి సమస్య ఉండదని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో జగనన్న కాలనీ ప్రస్తుతం పేరు మార్చామని ఎన్టీఆర్ కాలనీగా నామకరణం చేసినట్లు పేర్కొన్నారు. టిడ్కో గృహలు మూడు మాసాల్లో అక్కడ ఉన్న సమస్య్లలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని ఎమ్మెల్యే సమావేశంలో తెలియజేశారు. ముందుగా పహాల్గాంలో మృతిచెందిన బాధి తులకు రెండు నిమిషాలపాటు ఎమ్మెల్యే, చైర్‌పర్సన, కౌన్సిలర్లు మౌనం పాటించారు.
Updated Date - May 09 , 2025 | 11:51 PM