ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PCR Anjaneyulu: నాపై ఆరోపణలు నిరాధారం

ABN, Publish Date - May 22 , 2025 | 06:19 AM

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష మూల్యాంకన అక్రమాల కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. విజయవాడ ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో ఈ పిటిషన్‌ దాఖలైంది, అలాగే ముంబై నటి కాదంబరీ కేసులో ఆయన రిమాండ్‌ పొడగింపు జరిగింది.

గ్రూప్‌-1 కేసులో బెయిలివ్వండి: హైకోర్టును కోరిన పీఎస్‌ఆర్‌

అమరావతి, మే 21(ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష మూల్యాంకనంలో ఆక్రమాలపై విజయవాడ సూర్యారావుపేట పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్‌ కోసం సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ట్రయల్‌ కోర్టు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనపై పోలీసులు చేసిన ఆరోపణలు అన్నీ నిరాధారమైనవేనని పిటిషన్‌లో పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే గ్రూప్‌-1 జవాబు పత్రాలను మాన్యువల్‌గా మూల్యాంకనం చేపట్టామన్నారు. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు రానుంది. కాగా, గ్రూప్‌-1 కేసులో అరెస్టయి విజయవాడ జిల్లా జైల్లో ఉన్న పమిడికాల్వ మధుసూదన్‌ (ధాత్రి మధు) దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను విజయవాడ మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు న్యాయాధికారి దేవిక తిరస్కరించారు. మరోవైపు, ముంబై నటి కాదంబరీ జెత్వాని కేసులో ఐపీఎస్‌ అధికారి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు రిమాండ్‌ను వచ్చే నెల 4 వరకు న్యాయస్థానం పొడిగించింది.


Also Read:

Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు

Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..

Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి

Updated Date - May 22 , 2025 | 06:19 AM