ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు

ABN, Publish Date - Jun 14 , 2025 | 11:37 PM

ఇద్దరు అంతర్రాష్ట దొంగలను నందికొట్కూరు పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాల పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో అడిషనల్‌ ఎస్పీ యుగంధర్‌బాబు శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలు వెల్లడించారు.

నిందితుల అరెస్టును చూపుతున్న నంద్యాల అడిషనల్‌ ఎస్పీ యుగంధర్‌బాబు

నంద్యాల టౌన, జూన 14 (ఆంధ్రజ్యోతి): ఇద్దరు అంతర్రాష్ట దొంగలను నందికొట్కూరు పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాల పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో అడిషనల్‌ ఎస్పీ యుగంధర్‌బాబు శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలు వెల్లడించారు. నందికొట్కూరులోని బాలాజీ నగర్‌లో ఇటీవల దొంగతనం జరిగింది. ఈ కేసుపై నందికొట్కూరు పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 13న నందికొట్కూ రులోని ఆత్మకూరు రోడ్డులో మిర్యాలగూడకు చెందిన వేముల శంకర్‌, గుంటూరు జిల్లాకు చెందిన పవన కుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. వీరు కర్నూలు, నంద్యాల, గుంటూరు, తూర్పు గోదావరి, అనంతపురం, అన్నమయ్య, రాజమండ్రి, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో జరిగిన దొంగతనం కేసుల్లో ముద్దాయిలగా ఉన్నట్లు తేలింది. శంకర్‌పై 21 కేసులు, పవనకుమార్‌ 36 కేసులు ఉన్నాయి. వీరి నుంచి 394 గ్రాముల బంగారు ఆభరణాలు, 326 గ్రాముల వెండి వస్తువులు, ఒక ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.39 లక్షలు ఉంటుందని అడిషనల్‌ ఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశంలో సీసీఎస్‌ ఇనస్పెక్టర్‌ సురేశకుమార్‌, సిబ్బంది శ్రీనివాసులు, బాలకృష్ణ, ఓబయ్య, ఇబ్రహీం, యేసుదాస్‌, చంద్రశేఖర్‌, గంగారం, చిన్నమద్దిలేటి, మాలిక్‌బాషా, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 11:37 PM