ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Raghunath Reddy: ఏఐ స్టార్ట్‌పను నెలకొల్పి స్ఫూర్తిగా నిలిచావు

ABN, Publish Date - Mar 31 , 2025 | 04:03 AM

దివ్యాంగ విద్యార్థి రఘునాథ్ రెడ్డి, మంత్రి నారా లోకేశ్ సహాయంతో NIT కాలికట్‌లో ప్రవేశం పొందారు. ఇప్పుడు, ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ప్రారంభించి, విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచారు.

దివ్యాంగ విద్యార్థికి మంత్రి లోకేశ్‌ ప్రశంస

అమరావతి, మార్చి 30(ఆంధ్రజ్యోతి): ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ చొరవతో గతంలో ఎన్‌ఐటీ-కాలికట్‌లో సీటు పొందిన దివ్యాంగ విద్యార్థి రఘునాథరెడ్డి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ స్టార్టప్‌ నెలకొల్పారు. ఈ విషయాన్ని రఘునాథ్‌ ఎక్స్‌ ద్వారా తెలియజేశారు. లోకేశ్‌ ఇచ్చిన సహకారం, మార్గదర్శనం వల్లే రాణిస్తున్నానని రఘునాథ్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు. దీనిపై లోకేశ్‌ స్పందిస్తూ.. ‘మీ విజయంలో నేను చిన్న పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంది. మీ బృందం భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి. స్టార్ట్‌పను ప్రారంభించడం ద్వారా ఎందరో విద్యార్థులకు స్ఫూర్తి కలిగిస్తున్నారు’ అని పేర్కొన్నారు. గత ఏడాది జూలైలో దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యాసంస్థల్లో సీట్లు పొందిన దివ్యాంగ విద్యార్థులకు ఇంటర్మీడియట్‌ బోర్డు సర్టిఫికెట్‌ అప్‌లోడ్‌ విషయంలో సమస్య ఎదురైంది. ఆ సమస్యను విద్యార్థులు వాట్సాప్‌ మెసేజ్‌ ద్వారా లోకేశ్‌ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన లోకేశ్‌.. సమస్య పరిష్కారానికి ప్రత్యేక జీవో చ్చారు. దీంతో వారంతా ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశం పొందారు. అలా సీటు పొందినవారిలో రఘునాథ్‌ కూడా ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Ugadi Wishes 2025: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్..

Ugadi Awards 2025: ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే: సీఎం చంద్రబాబు..

TDP Nara Lokesh: సీనియర్లకు గౌరవం.. జూనియర్లకు ప్రమోషన్‌

For More AP News and Telugu News

Updated Date - Mar 31 , 2025 | 04:03 AM