ఆడిట్ అధికారుల తనిఖీలు
ABN, Publish Date - Apr 24 , 2025 | 12:10 AM
శ్రీశైలం దేవస్థానానికి సంబంధించిన పలు రికార్డులను బుధవారం ఆడిట్ అధికారులు తనిఖీ చేశారు.
శ్రీశైలం దేవస్థాన రికార్డులు, ఖర్చుల పరిశీలన
శ్రీశైలం, ఏప్రీల్ 23(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం దేవస్థానానికి సంబంధించిన పలు రికార్డులను బుధవారం ఆడిట్ అధికారులు తనిఖీ చేశారు. జిల్లా ఆడిట్ అధికారి ఆదేశాల మేరకు 18 మంది ప్రతేక ఆడిట్ అధికారులు 2018-19, 2019-20, 2022-23 సంవత్సరాలకు సంబంధించిన రికార్డులు, రిజిస్టర్లు, బ్యాంకు లావాదేవీలు, ఖర్చులు వంటి అంశాలపై తనిఖీ చేయనున్నట్టు స్థానిక సహాయ ఆడిట్ అధికారి (ఏఏఓ) రమేష్ తెలిపారు. దేవస్థానంలో పనిచేయు ప్రతి ఉద్యోగి సర్వీసు వ్యవహారాలను కూడా ప్రత్యేకంగా తనిఖీ చేయనున్నట్లు ఆడిట్ అధికారులు తెలిపారు. ఆలయం, వసతి, పారిశుధ్యం, రెవెన్యూ, ఇంజనీరింగ్ విభాగంతో పాటు మిగిలిన అన్ని విభాగా లకు సంబంధించిన రికార్డులు, రిజిస్టర్లను ఆడిట్ అధికారులకు అందజేయాలని సంబంధిత అధికారులను, సిబ్భందిని దేవస్థానం కార్య నిర్వహాణాధికారి ఎం. శ్రీనివాసరావు ఆదేశించారు. ఆడిట్ తనిఖీలలో అభ్యంతరాలు ఉత్పన్నమైతే పూర్తి బాధ్యత సంబంధిత విభాగాధిపతులు, గుమాస్తాలు బాధ్యత వహించాలని ఈవో సూచించారు. సుమారు నెల రోజులపాటు తనిఖీలు నిర్వహించ్చనున్నట్లు ఏఏఓ తెలిపారు. మూడు సంవత్సరాలకు సంబంధించిన రికార్డులు, రిజిస్టర్లను ఆడిట్ తనిఖీలు చేసి అభ్యంతరాలను డీడీఓకు నివేదిక ఇస్తారన్నారు.
Updated Date - Apr 24 , 2025 | 12:10 AM