ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Increased Loans: రైతుకు పెరిగిన రుణ పరపతి

ABN, Publish Date - Jun 18 , 2025 | 07:13 AM

రాష్ట్రంలో రైతులకు రుణ పరపతి సౌకర్యం పెరిగింది. 2025-26 ఖరీఫ్‌, రబీ సీజన్లలో వివిధ పంటల సాగుకు రుణ పరిమితిని బ్యాంకర్ల కమిటీ పెంచింది. వ్యవసాయ, ఉద్యాన పంటలు, పట్టు, పాడి పశువులు, కోళ్లు, చేపలు, రొయ్యల పెంపకానికి స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ని స్టేట్‌ లెవల్‌ టెక్నికల్‌ కమిటీ ఖరారు చేసింది.

  • 2025-26లో పంటల సాగుకు వర్తింపు

  • స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఖరారు చేసిన ఎస్‌ఎల్టీసీ

అమరావతి, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతులకు రుణ పరపతి సౌకర్యం పెరిగింది. 2025-26 ఖరీఫ్‌, రబీ సీజన్లలో వివిధ పంటల సాగుకు రుణ పరిమితిని బ్యాంకర్ల కమిటీ పెంచింది. వ్యవసాయ, ఉద్యాన పంటలు, పట్టు, పాడి పశువులు, కోళ్లు, చేపలు, రొయ్యల పెంపకానికి స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ని స్టేట్‌ లెవల్‌ టెక్నికల్‌ కమిటీ ఖరారు చేసింది. దీని ప్రకారం గతేడాది కన్నా ఈ ఏడాది ఎకరానికి ఎర్ర మిర్చి సాగుకు రూ.35-50వేలు, పచ్చి మిర్చికి రూ.10వేలు ఖరారు చేశారు. వరికి రూ.ఐదారువేలు, పత్తికి రూ.నాలుగైదు వేలు పెరిగింది. ఖరీఫ్‌ వరికి రూ.46-52వేలు, రబీలో రూ.50-55వేలు, శ్రీవరికి రూ.35-40వేల చొప్పున బ్యాంకులు రుణాలివ్వనున్నాయి. పత్తికి ఇరిగేషన్‌ ఏరియాలో రూ.48-55వేలు, వర్షాధార ప్రాంతాల్లో రూ.46-51వేలు, పచ్చిమిర్చికి రూ.లక్ష నుంచి రూ.లక్షా10వేలు, ఎర్రమిర్చికి రూ.రూ.1.50లక్షల నుంచి రూ.1.75లక్షలకు రుణ పరిమితి పెంచారు. గతేడాది కన్నా వర్జీనియా పొగాకుకు రూ.10వేలు, చెరకుకు రూ.5వేలు పెంచారు. కందికి రూ.6వేలు, మినుముకు రూ.6-8వేలు, పెసరకు రూ.2వేలు, శనగకు రూ.3వేలు, సన్‌ఫ్లవర్‌కు రూ.5వేలు, వేరుశనగకు రూ.3వేలు, ఆయిల్‌పామ్‌కు రూ.5వేలు పెంచారు. అరటికి రూ.6-10వేలు, మామిడి సహా ఉద్యాన తోటలకు రూ.3-5వేలు పెంచారు. చేపల పెంపకానికి 30వేలు, రొయ్యలకు 34-36వేలు, పట్టుసాగుకు 15వేలు, బాయిలర్‌ కోడికి 10-20, లేయర్‌ కోడికి 20 పెంచారు.

Updated Date - Jun 18 , 2025 | 07:14 AM