ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రుణ పరిమితి పెంపు

ABN, Publish Date - Jun 25 , 2025 | 11:41 PM

కష్టాల్లో ఉన్న రైతులకు భారీ ఊరట లభించింది. వారం క్రితమే రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల సమక్షంలో అమరావతిలో బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది.

ఈ ఖరీఫ్‌ నుంచే అమలు

వరి, పత్తి, మిర్చి, పొగాకు, మామిడి పంటలపై అధిక రుణం

ఆనందంలో అన్నదాతలు

కర్నూలు అగ్రికల్చర్‌, జూన 25 (ఆంధ్రజ్యోతి): కష్టాల్లో ఉన్న రైతులకు భారీ ఊరట లభించింది. వారం క్రితమే రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల సమక్షంలో అమరావతిలో బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పంట సాగు కోసం రైతులకు ఖర్చులు పెరిగిపోయాయని, అందువల్ల గతంలో కంటే రుణపరిమితి ప్రస్తుత ఖరీఫ్‌ సీజనలో ఎక్కువ ఇచ్చేందుకు బ్యాంకులు ఉదారంగా పంట రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావాలని ప్రభుత్వం సూచించడంతో బ్యాంకర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో వరి పంట సాగుకోసం ఎకరాకు గత ఏడాది రూ.46వేలు రుణాన్ని బ్యాంకులు ఖరారు చేశాయి. ఈ సంవత్సరం రూ.52వేలకు పెంచారు. శ్రీవరి గత ఏడాది రూ.35వేలు రుణాన్ని ఇవ్వగా ఈసారి రూ.40వేలు ఇవ్వాలని నిర్ణయించారు. ఎర్రమిర్చి గత ఏడాది రూ.1.50లక్షలు ఇవ్వగా, ఈసారి ఆ మొత్తాన్ని రూ.1.75 లక్షలకు పెంచారు. పచ్చిమిర్చికి గత ఏడాది రూ.90వేల రుణాన్ని అందించగా.. ఈసారి ఖరీఫ్‌లో 1.10 లక్షలకు పెంచారు. పత్తి (నీటి పారుదల) గత ఖరీఫ్‌లో రూ.48వేలు రుణాన్ని అందించగా ఈసారి రూ.55వేలకు పెంచారు. పత్తి వర్షాధార పంటకు గతంలో రూ.46వేలకు అందించగా.. ఈసారి రూ.51వేలకు పెంచారు. చెరుకు రూ.5వేలకు పెంచారు. అరటి (ప్లాంటేషన 99వేల నుంచి రూ.1.10లక్షలు, మామిడి 49వేల నుంచి రూ.55వేలు పెంచారు. చేపల పెంపకం గత ఏడాది రూ.30వేలు కాగా, ఈసారి రూ.35వేలు ఇవ్వనున్నారు. ప్రధాన పంటల సాగుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో బ్యాంకర్ల కమిటీ ప్రధాన పంటలైన వరి, మిర్చి, పత్తి పంటలకు రుణపరిమితిని పెండంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన రుణ పరిమితితో రైతులు ఎక్కువ పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ సంవత్సరం ఖరీఫ్‌లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 8వేల కోట్ల దాకా వివిద బ్యాంకుల నుంచి రైతులకు అందించే అవకాశం ఉంది.

గతంలో కంటే ఈ సారి..

ఇటీవల స్టేట్‌ బ్యాంకర్ల కమిటీ సమావేశమై ఖరీఫ్‌లో వివిధ పంటలకు అందించనున్న రుణపరిమితిపై నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఉమ్మడి జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ కూడా సమావేశమై రుణ పరిమితిని ఖరారు చేయనున్నారు. గతంలో కంటే ప్రస్తుత ఖరీఫ్‌లో రైతులకు పంట సాగుకు రుణ పరిమితిని ఎక్కువ అందించే అవకాశం ఉంది.

Updated Date - Jun 25 , 2025 | 11:41 PM