ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉపాఽధి అవినీతిపై డిప్యూటీ సీఎంకు నివేదిస్తా

ABN, Publish Date - Jul 26 , 2025 | 11:18 PM

ఉపాధి హామీ పథకంలో భారీ అవినీతి జరిగిందని, ఈ విషయాన్ని మంత్రి, డిప్యూటీ సీఏం పవనకళ్యాణ్‌ దృష్టికి తీసుకెళ్తానని ఉమ్మడి కర్నూల్‌ జిల్లా పరిషత చైర్మన ఎర్రబోతుల పాపిరెడ్డి పేర్కొన్నారు.

మాట్లాడుతున్న జడ్పీచైర్మన ఎర్రబోతుల పాపిరెడ్డి

ప్రభుత్వ పథకాలపై అధికారుల ఉదాసీనత

అధికారుల తీరుపై మండిపడిన జడ్పీ చైర్మన

కొలిమిగుండ్ల, జులై 26 (ఆంధ్రజ్యోతి) : ఉపాధి హామీ పథకంలో భారీ అవినీతి జరిగిందని, ఈ విషయాన్ని మంత్రి, డిప్యూటీ సీఏం పవనకళ్యాణ్‌ దృష్టికి తీసుకెళ్తానని ఉమ్మడి కర్నూల్‌ జిల్లా పరిషత చైర్మన ఎర్రబోతుల పాపిరెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో వివిధ శాఖల అధికారుల తీరుపై మండిపడ్డారు. గ్రామాల్లో జరిగిన ఉపాధి పనుల్లో భారీగా నిధుల దుర్వినియోగం జరిగిందని, దీనిపె కలెక్టర్‌, పీడీ, విజిలెన్సకు కూడా నివేదిస్తానని హెచ్చరించారు. మరోవైపు ఉపాధి, పశువైద్యం, వ్యవసాయ శాఖ, ఉద్యానవనం తదితర శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి కృషి చేయాలని సూచించారు. తాగునీటి సమస్యలను పరిష్కరించాలని, అవసరమైతే జడ్పీ నిధు లు కేటాయిస్తానని అన్నారు. ప్ర భుత్వం నిధులు మంజూరు చేసి నా సకాలంలో భవన నిర్మాణం చేపట్టకుండా నిధులు నిరుపయోగంగా మార్చారని పంచాయతీరాజ్‌ ఏఈ అన్వర్‌బాషాపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈసందర్భంగా ఆయా శాఖల అధికారులు తమతమ శాఖల ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రసాదరెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీపీ నాగవేణి, ఎంఈవో అబ్దుల్‌కలాం, ఏపీవో నిర్మల, ఏఈ కరీముల్లా, డా.హరిచరణ్‌రెడ్డి, ఏఈవో నాగరాజు, ఆయా శాఖల అధికారులు, సర్పంచలు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2025 | 11:18 PM