ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హైటెన్షన్‌

ABN, Publish Date - Jul 14 , 2025 | 01:01 AM

బందరులో రాజకీయం వేడెక్కుతోంది. ‘బాబు ష్యూరిటీ - మోసం గ్యారంటీ’ పేరుతో వైసీపీ నిర్వహిస్తున్న సమావేశాల్లో పేర్ని నాని రెచ్చగొట్టే వ్యాఖ్యలతో రాజకీయ దుమారం మొదలైంది. పామర్రులో చేసిన నరుకుడు భాషను మించి పెడనలో రెచ్చిపోయారు. ‘నేను చెబితే పట్టపగలే చేయాలని చెబుతానంటూ’ వీర్రవీగారు. శనివారం గుడివాడలో జరిగిన ఘటనలతో పామర్రు వెళ్లవద్దన్న పోలీసుల హెచ్చరికలను పెడచెవినపెట్టి ‘టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌, మంత్రి కొల్లు రవీంద్రపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు.

- మచిలీపట్నం, పెడనలో ఉద్రిక్తత...

- పేర్ని ఇంటి వద్ద పోలీస్‌ బందోబస్తు

- గుడివాడ ఘటన నేపథ్యంలో పెడన వెళ్లవద్దన్న పోలీసులు

- పోలీసుల మాటలు లెక్క చేయకుండా వెళ్లి రెచ్చగొట్టే ప్రసంగాలు

- చంద్రబాబు నుంచి కొల్లు రవీంద్ర వరకూ అందరిపై ఇష్టానుసారం వ్యాఖ్యలు

బందరులో రాజకీయం వేడెక్కుతోంది. ‘బాబు ష్యూరిటీ - మోసం గ్యారంటీ’ పేరుతో వైసీపీ నిర్వహిస్తున్న సమావేశాల్లో పేర్ని నాని రెచ్చగొట్టే వ్యాఖ్యలతో రాజకీయ దుమారం మొదలైంది. పామర్రులో చేసిన నరుకుడు భాషను మించి పెడనలో రెచ్చిపోయారు. ‘నేను చెబితే పట్టపగలే చేయాలని చెబుతానంటూ’ వీర్రవీగారు. శనివారం గుడివాడలో జరిగిన ఘటనలతో పామర్రు వెళ్లవద్దన్న పోలీసుల హెచ్చరికలను పెడచెవినపెట్టి ‘టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌, మంత్రి కొల్లు రవీంద్రపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:

కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన వైసీపీ నియోజకవర్గ సమావేశాల్లో మాజీ మంత్రి పేర్ని నాని కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా చేసిన వ్యాఖ్యలు జిల్లాలో రాజకీయ దుమారం రేపాయి. అధికార, ప్రతిపక్షాలు విమర్శలతో హోరెత్తిస్తున్నాయి. ఆదివారం పెడన నియోజకవర్గ వైసీపీ సమావేశం నేపథ్యంలో పెడన పట్టణంలో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. మచిలీపట్నంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పోలీసులను రప్పించి ఎక్కడికక్కడ పహారా పెట్టారు.

పేర్ని ఇంటి వద్ద ఉద్రిక్తత

వైసీపీ సమావేశాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి పేర్ని నానిపై పలు పోలీస్‌ స్టేషన్‌లలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదులు చేయడంతో ఆయనను పోలీసులు అరెస్ట్‌ చేస్తారనే ప్రచారం ఆదివారం విస్తృతంగా జరిగింది. ఈ క్రమంలో శనివారం గుడివాడలో బీసీ మహిళా అయిన జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారికపై టీడీపీ నాయకులు దాడి చేశారని, ఈ అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాలని పేర్ని నాని ఫోన్‌లో మాట్లాడుతున్న వీడియో వైరల్‌ అయ్యింది. దీంతో ఈ అంశంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఏఎస్పీ సత్యనారాయణ, బందరు డీఎస్పీ సీహెచ్‌ రాజా, పలువురు సీఐలు, ప్రత్యేక పోలీస్‌ బలగాలతో పేర్నినాని ఇంటి వద్దకు వచ్చారు. ఆ సమయంలో పేర్నిని అరెస్ట్‌ చేస్తారనే ప్రచారం జరిగింది. దీంతో వైసీపీ శ్రేణులు పేర్ని ఇంటి వద్దకు చేరుకున్నారు. పెడన నియోజకవర్గంలో జరిగే వైసీపీ సమావేశానికి వెళ్ల వద్దని, పరిస్థితులు అదుపుతప్పేలా ఉన్నాయని, తమకు సహకరించాలని పోలీసులు పేర్ని నానికి వివరించారు. అయినప్పటికీ తాను పెడనలో జరిగే కార్యక్రమానికి వెళతానని చెప్పిన ఆయన, అన్నట్టుగానే పెడనలో జరిగిన వైసీపీ సమావేశానికి హాజరయ్యారు. అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు పేర్ని ఇంటికి వచ్చి మంతనాలు జరిపారు.

ఎస్పీని కలిసిన వైసీపీ జెడ్పీటీసీలు

గుడివాడలో జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారికను అడ్డగించి, ఆమె కారు అద్దాలను పగులకొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లాలోని వైసీపీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ఎస్పీ ఆర్‌.గంగాధరరావును కలిసి వినతిపత్రం అందించారు.

హింసను ప్రేరేపించేలా వ్యాఖ్యలు : ఎమ్మెల్యే కాగిత

మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్‌ అన్నారు. జగన్‌ కళ్లలో ఆనందం చూడాలనే ఆకాంక్షతో పేర్ని నాని ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

నేను చెబితే పట్టపగలే చేసేయాలని చెబుతా : పేర్ని నాని

పెడనలో జరిగిన వైసీపీ సమావేశంలో పేర్ని నాని మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చీకట్లో ఎవరినీ చంపేయాలని తాను చెప్పలేదని, చెబితే మాత్రం పట్టపగలే చేయాలని చెబుతానని అన్నారు. ఎవరిపై విమర్శలు చేయని జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారికను ఇబ్బంది పెట్టారని, ఆమె కళ్ల నుంచి వచ్చిన ప్రతి కన్నీటి బొట్టు మీకు శాపంగా మారుతుందన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర బందరులో స్థలాలు ఆక్రమించుకుని పెద్ద భవంతిని నిర్మిస్తున్నారని, మద్యం దుకాణాల నుంచి, ఇసుక రేవుల నుంచి వచ్చే ముడుపులు తింటున్నారని విమర్శించారు. బందరు కోటలో తొమ్మిది ఎకరాలు ఆక్రమించుకుని ఐస్‌ ఫ్యాక్టరీ కడుతున్నారని ఆరోపించారు. కృత్తివెన్నులో 45 ఎకరాల భూమిని ఆక్రమించేశారని విమర్శించారు. జెడ్పీ చైర్‌పర్పన్‌ ఉప్పాల హారిక మాట్లాడుతూ మహిళను అయిన తనను గుడివాడలో టీడీపీ కార్యకర్తలు అవమానిం చినా, తనపై దాడి చేసినా హోంమంత్రి ఇంత వరకు స్పందించలేదన్నారు.

టీడీపీ శ్రేణులపై కేసు నమోదు

గుడివాడ, జూలై 13 (ఆంధ్రజ్యోతి): గుడివాడలో వైసీపీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి వెళ్తున్న తనను స్థానిక నాగవరప్పాడు సెంటర్‌లో టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డగించి, అసభ్యపదజాలంతో దూషించారంటూ జిల్లా పరిషత చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పిర్యాదు మేరకు 126(2), 292, 324(4), 351(2) రెడ్‌ విత 3(5) బిఎన్‌ఎస్‌ కింద కేసులు నమోదు చేసినట్లు వన్‌టౌన్‌ సీఐ కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.

Updated Date - Jul 14 , 2025 | 01:01 AM