ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nellore : తాబేళ్లపై మృత్యు వల!

ABN, Publish Date - Jan 21 , 2025 | 05:44 AM

కొందరు వేటగాళ్ల నిర్లక్ష్యానికి సముద్రంలోని భారీ తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి.

చేపల వేటకు వచ్చి చంపుతున్న తమిళనాడు బోట్లు

అల్లూరు తీరం వెంబడి భారీగా కళేబరాలు

సంతానోత్పత్తి కోసం తీరానికి వచ్చి మృత్యువాత

విస్మరిస్తే అంతరించిపోయే ప్రమాదం.. వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏమైంది?

అల్లూరు, జనవరి 20: కొందరు వేటగాళ్ల నిర్లక్ష్యానికి సముద్రంలోని భారీ తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. రెండేళ్లుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా సముద్ర తీరప్రాంతంలో వేలాదిగా తాబేళ్ల కళేబరాలు కనిపిస్తూనే ఉన్నా.. ఏదో చనిపోయాయిలే అన్న ధోరణితో అందరూ చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. కానీ పరిశీలనగా చూస్తే చేపల వేటకని వెళ్లేవారిలో కొందరు వాటిని పొట్టన పెట్టుకుంటున్నట్లు అర్థమవుతుంది. వాస్తవానికి ఇది సీజన్‌ కావడంతో సముద్రంలోని లోతట్టు ప్రాంతాల్లో జీవించే తాబేళ్లు తీరానికి చేరుకొని గుడ్లు పెట్టి తిరిగి వెళ్లిపోతాయి. ప్రధానంగా కర్మాగారాల్లో నుంచి వచ్చే వ్యర్థాలు సముద్రంలో కలవడం వల్ల నీరు కలుషితమవుతుంది. ఇలాంటి సమయంలో మృతిచెందే తాబేళ్లు తీరంలో 100 కి.మీ పరిధిలో చూసుకున్నా పది పదిహేను ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో జిల్లాలోని 173 కి.మీ విస్తీర్ణం ఉన్న తీరప్రాంతంలో వేలాది సంఖ్యలో తాబేళ్ల కళేబరాలు దర్శనమిస్తున్నాయి. ఇది మాత్రం కాలుష్య ప్రభావం కాదని, కేవలం మానవ తప్పిదమేనని స్థానికులు అంటున్నారు.

వేటకు వచ్చి చంపేస్తున్నారు: ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే పెద్దబోట్ల (సోనాబోట్లు) కారణంగా తాబేళ్లు వేలాది సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయని కొంతమంది పరిశీలకులు, స్థానిక మత్స్యకారులు అంటున్నారు. అత్యధికంగా నెల్లూరు జిల్లాకు తమిళనాడు బోట్ల సమస్య ఇటీవల తీవ్రం కావడంతో వీరు వినియోగించే భారీ వలల కారణంగా తాబేళ్లు మృతిచెందుతున్నాయని మత్స్యకారులు అంటున్నారు. తమిళనాడు బోట్లు నిర్వాహకులు అక్రమంగా రావడమే కాకుండా తమ భారీ బోట్లకు వెనుక ఏర్పాటు చేసే భారీ వలను బోటుతోపాటు నీటిలోనే లాక్కెళ్లడంతో దానికి సమీపంలో వచ్చే పెద్ద చేపలతోపాటు అన్ని రకాల మత్స్యజాతి జీవులు ఇరుక్కుంటాయి.


ఇలా రెండు రోజులపాటు ఈడ్చుకుంటూ వెళ్లే క్రమంలో తాబేళ్లు ఆ వలలో చిక్కుకోవడంతో భారీ స్థాయిలో మృత్యువాత పడుతున్నాయని మత్స్యకారులు అంటున్నారు. తాబేలు జీవిత కాలం 80 నుంచి 150 ఏళ్లయినప్పటికీ.. వీటిని ఆదిలోనే చిదిమేస్తున్న పరిస్థితి. ఇది సాధారణమే అనుకొని విస్మరిస్తే సముద్ర తాబేళ్లు అంతించి పోయే ప్రమాదం ఉంది. వన్యప్రాణులను హతమారిస్తే కఠినశిక్షలు పడతాయని ప్రభుత్వాలు హెచ్చరించడమే కాదు, అలాంటి చర్యలకు పాల్పడిన వారిని కఠినంగానే శిక్షిస్తోంది. కానీ సముద్రంలో పెరిగే భారీ తాబేళ్లను చంపుతుంటే వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏమైందని జంతు ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు.

ఇతర రాష్ర్టాల బోట్లను నిలువరించాలి

భారీ వలల కారణంగా తాబేళ్లు మృతి చెందుతున్నాయి. చేపల వేటలో చేపలు తప్ప మిగతా ఏ జీవి పడినా వాటిని అక్కడే సురక్షితంగా వదిలేస్తుంటాం. కానీ కొంతకాలంగా పక్క రాష్ర్టాల వారు బోట్లకు భారీ వలలను ఏర్పాటు చేసి వాటిని నీటిలోనే ఈడ్చుకుంటూ రావడం రెండు రోజుల తర్వాత గానీ వాటిని చూడకపోవడంతో చేపలు మినహా మిగతా జీవులు భారీ స్థాయిలో మృతిచెందుతున్నాయి. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే బోట్లను నిలువరిస్తేగానీ ఈ సమస్య తగ్గుముఖం పట్టదు.

- ఆవుల త్యాగరాజు, మత్స్యకారుడు,

తాటిచెట్లపాలెం, బోగోలు మండలం

Updated Date - Jan 21 , 2025 | 05:44 AM