ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం

ABN, Publish Date - Apr 19 , 2025 | 12:10 AM

భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నట్లు అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ రామకృష్ణారెడ్డి తెలిపారు.

స్వాధీనం చేసుకున్న మద్యం, వాహనంతో ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ రామకృష్ణారెడ్డి, సిబ్బంది

నలుగురికి రిమాండ్‌

కోసిగి, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నట్లు అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ రామకృష్ణారెడ్డి తెలిపారు. స్థానిక ఎక్సైజ్‌ స్టేషన పరిధిలోని మాలపల్లి నుంచి కం బాలదిన్నె రోడ్డులో మారెమ్మ గుడి వెనుకాల కారులో అక్రమంగా 40 బాక్సుల కర్ణాటక మద్యం తరలిస్తున్నారని శుక్రవారం పక్కా సమాచారం అందింది. దీంతో సీఐ భార్గవ్‌రెడ్డి ఆధ్వర్యంలో దాడులుచేసి 3,840 డీలక్స్‌ విస్కీ 40 బాక్సులు ఇన్నోవా కారును పట్టుకున్నట్లు రామకృష్ణారెడ్డి తెలిపారు. అక్రమ మద్యం పట్టుకున్న విలువ రూ.3,53,600 ఉండొచ్చని ఆయన తెలిపారు. పట్టుబడిన నిందితుల్లో మంత్రాలయం మండలం రచ్చుమర్రికి చెందిన గుడుగుడు గోవింద, పోలివీరేష్‌, మజ్జిగ బొజ్జప్ప, పెద్దకడుబూరు మండలం కబందహాల్‌ గ్రామానికి చెందిన బోయ బాలు ను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించామన్నారు. అలాగే మంత్రాలయం మండలం రచ్చమర్రి గ్రామానికి చెందిన ఆదోని శివశంకర్‌, పెద్దకడుబూరు మండలం కంబాలదిన్నె గ్రామానికి చెందిన బోయ హుశేనీ పరారీలో ఉన్నారని ఎక్సైజ్‌ సీఐ తెలిపారు. ఎక్సైజ్‌ ఇనస్పెక్టర్‌ కేఆర్‌ రాజేంద్రప్రసాద్‌, ఎస్‌ఐ నాగేంద్ర, సిబ్బంది కిషోర్‌, మునిరంగడు, భరత, రవికుమార్‌, మధు, లాలు, కుమారస్వామిరెడ్డి తదితరులున్నారు.

Updated Date - Apr 19 , 2025 | 12:10 AM