మండలాల పునర్విభజనపై ఆశలు
ABN, Publish Date - Jul 31 , 2025 | 11:45 PM
మన్యం ప్రాంతం విస్తీర్ణం పరంగా 6,200 చదరపు కిలోమీటర్లుంది. దీంతో మండల కేంద్రాలకు, మండల పరిధిలోని గ్రామాలకు దూరం సుమారుగా 15 నుంచి 45 కిలోమీటర్లు వరకు ఉంది. ఆయా మారుమూల ప్రాంతాలకు చెందిన గిరిజనులు తమ అవసరాల కోసం మండల కేంద్రాలకు రావాలంటే అవస్థలు పడుతున్నారు.
ఏజెన్సీలో ప్రస్తుతం 11 మండలాలు
కొత్తగా మరో 8 మండలాల ఏర్పాటు అవసరమని అంచనా
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు
ఇప్పటికే పలు మండలాల ప్రజల నుంచి పెరుగుతున్న డిమాండ్
మండల కేంద్రాల దూరాభారం తగ్గుతుందని గిరిజనుల ఆశాభావం
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
మన్యం ప్రాంతం విస్తీర్ణం పరంగా 6,200 చదరపు కిలోమీటర్లుంది. దీంతో మండల కేంద్రాలకు, మండల పరిధిలోని గ్రామాలకు దూరం సుమారుగా 15 నుంచి 45 కిలోమీటర్లు వరకు ఉంది. ఆయా మారుమూల ప్రాంతాలకు చెందిన గిరిజనులు తమ అవసరాల కోసం మండల కేంద్రాలకు రావాలంటే అవస్థలు పడుతున్నారు. అలాగే ఆయా మారుమూల ప్రాంతాలకు రోడ్డు, రవాణా సదుపాయాలు లేకపోవడంతో మండల కేంద్రాలకు రాలేకపోతున్నారు. ఈ తరుణంలో ఏజెన్సీలో మండలాల పునర్విభజన చేస్తే గిరిజనులకు సౌకర్యవంతంగా ఉంటుందనే వాదన చాలా కాలంగా వినిపిస్తోంది.
రాష్ట్రంలోని జిల్లాలు, మండలాల పునర్విభజన చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పాటు అందుకు గాను ఒక ప్రత్యేక కమిటీని వేసింది. దీంతో ఏజెన్సీలోని మండలాల పునర్విభజన అంశం తాజాగా తెరపైకి వచ్చింది. ఇప్పటికే పెదబయలు మండలం గోమంగి కేంద్రంగా మండలాన్ని ఏర్పాటు చేయాలని ఆయా ప్రాంత గిరిజనులు కలెక్టర్ దినేశ్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించగా, పెదబయలు, పాడేరు మండలాల సరిహద్దు పంచాయతీలను కలిపి గుత్తులపుట్టు మండలంగా ప్రకటించాలని బుధవారం పెదబయలు మండలం కుంతుర్లలో ఆందోళన చేశారు.
ప్రజల డిమాండ్లు ఇలా...
- అనంతగిరి మండలం: ఈ మండలంలో మొత్తం 24 పంచాయతీలుండగా.. 9 పంచాయతీలను కలిపి అనంతగిరి మండలం, మిగిలిన వాటిలో ఎనిమిది పంచాయతీలను కలిపి కొత్తగా కాశీపట్నం మండలం ఏర్పాటు చేయాలి. అలాగే నాలుగు పంచాయతీలను మైదాన ప్రాంతమైన దేవరాపల్లిలో కలపాలని, డుంబ్రిగుడ మండలానికి చేరువగా ఉన్న మరో రెండు పంచాయతీలను కొత్తగా ఏర్పాటు చేసే కించుమండ మండలంలో కలపాలనే వాదన వినిపిస్తున్నది.
- అనంతగిరి మండలంలో పంచాయతీలు: అనంతగిరి, ఎగువశోభ, టోకూరు, బొర్రా, కొండిభ, కోనాపురం, పెదబిడ్డ, గుమ్మ, వాలాసి, లుంగపర్తి పంచాయతీలు.
- కాశీపట్నం కొత్త మండలంలో పంచాయతీలు: కాశీపట్నం, చిలకలగెడ్డ, కొత్తూరు, ఎన్‌ఆర్‌పురం, భీంపోలు, గుమ్మకోట, గరుగుబిల్లి, రొంపల్లి పంచాయతీలుంటాయి. ’దేవరాపల్లి’ మండలానికి సమీపంలో ఉన్న పినకోట, పెదకోట, కివర్ల, జీనబాడు పంచాయతీలను దేవరాపల్లి మండలంలో కలపాలి. అవకాశం లేకపోతే కాశీపట్నంలో కలపాలి. అలాగే వేంగడ, పైనంపాడు పంచాయతీలను ‘కించుమండ మండలం’లో కలపాలి.
- అరకులోయ మండలం: ఈ మండలంలో మొత్తం 14 పంచాయతీలుండగా... ఇక్కడ కొత్తగా మండలాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ మండలానికి చేరువగా ఉన్న హుకుంపేట మండలంలోని బూర్జ పంచాయతీని, డుంబ్రిగుడ మండలంలోని కొల్లాపుట్టు పంచాయతీని అరకులోయ మండలంలో కలిపితే బాగుంటుంది.
- డుంబ్రిగుడ మండలం: ఈ మండలంలో మొత్తం 18 పంచాయతీలు ఉండగా... వాటిలో అరకు, అరమ, గసబా, గుంటగన్నెల, గుంటసీమ, కొర్రాయి, కూండ్రుం, కురిడి, లైగండ, పోతంగి, రంగిలిసింగి, సాగర, సొవ్వా, తూటంగి మొత్తం 14 పంచాయతీలను కలిపి డుంబ్రిగుడ మండలంలో ఉండాలి. మిలిగిన నాలుగు పంచాయతీల్లో కొల్లాపుట్టు పంచాయతీని అరకులోయ మండలంలో కలపాలి.
- కించుమండ కొత్త మండలంలో పంచాయతీలు: కించుమండ, కితలంగి, కొర్రా పంచాయతీలతో పాటు హుకుంపేట మండలానికి చెందిన మజ్జివలస, పట్టాం, గత్తుం పంచాయతీలు, అనంతగిరి మండలానికి చెందిన వేంగడ, పైనంపాడు మొత్తం 8 పంచాయతీలను కించుమండలో కలపాలి.
- హుకుంపేట మండలం: ఈ మండలంలో మొత్తం 33 పంచాయతీలుండగా, కొత్తగా మరో మండలాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. కానీ డుంబ్రిగుడ మండలానికి చేరువగా ఉన్న మజ్జివలస, పట్టాం, గత్తుం పంచాయతీలను కొత్తగా ఏర్పాటు చేసే కించుమండ మండలంలో కలపాలి. అలాగే అరకులోయ మండలానికి చేరువగా ఉన్న బూర్జ పంచాయతీని ఆ మండలంలో విలీనం చేయాలి.
- పాడేరు మండలం నుంచి వేరు చేసి..: ఈ మండలంలో మొత్తం 26 పంచాయతీలున్నాయి. వాటిలో 9 పంచాయతీలను వేరు చేసి, సమీపంలో ఉన్న పెదబయలుకు చెందిన మరో 4 పంచాయతీలు కలిపి మొత్తం 13 పంచాయతీలతో ‘గుత్తులపుటు’్టను కొత్త మండలంగా చేస్తే బాగుంటుంది.
- పాడేరు మండలం: పాడేరు, చింతలవీధి, వనుగపల్లి, వంట్లమామిడి, వంతాడపల్లి, వంజంగి, తుంపాడ, సలుగు, మోదాపల్లి, మినుములూరు, లగిశపల్లి, కుజ్జెలి, కిండంగి, కాడెలి, ఐనాడ, గొందూరు, దేవాపురం మొత్తం 17 పంచాయతీలు.
- గుత్తులపుట్టు కొత్త మండలంలో పంచాయతీలు: గుత్తులపుట్టు, జి.ముంచంగిపుట్టు, బడిమెల, బరిసింగి, డోకులూరు, ఇరడాపల్లి, గబ్బంగి, కించూరు, గొండెలి పంచాయతీలతో పాటు సమీపంలో ఉన్న పెదబయలుకు చెందిన మరో నాలుగు కుంతుర్ల, కిముడుపల్లి, పెదకోడాపల్లి, గంపరాయి పంచాయతీలు మొత్తం 13 పంచాయతీలు వస్తాయి.
- జి.మాడుగుల మండలం: ఈ మండలంలో మొత్తం 17 పంచాయతీలుండగా.... వాటిలో మొత్తం 12 పంచాయతీలు జి.మాడుగుల, బీరం, గడుతూరు, కె.కోడాపల్లి, కోరాపల్లి, కుంబిడిసింగి, పాలమామిడి, పెదలోచలి, పెదలువ్వాసింగి, సింగర్భ, సొలభం, వంతాల పంచాయతీలతో జి.మాడుగుల మండలం ఉంటుంది. మిగిలిన అయిదు పంచాయతీల్లో గెమ్మెలి, వంజంగి పంచాయతీలు కొత్తగా ఏర్పడే తాజంగి మండలంలో కలుస్తాయి. అలాగే మిగిలిన నుర్మతి, కిల్లంకోట, బొయితిలి పంచాయతీలు మద్దిగరువు కొత్త మండలంలో కలుస్తాయి.
- మద్దిగరువు కొత్త మండలంలో పంచాయతీలు: జి.మాడుగుల మండలంలోని మద్దగరువులో కొత్త మండలాన్ని ఏర్పాటు చేస్తే జి.మాడుగుల, పెదబయలు మండలాల్లోని మారుమూల పంచాయతీ వాసులకు సౌకర్యవంతంగా ఉంటుంది. కొత్త మండంలో నుర్మతి, బొయితిలి, కిల్లంకోట, పెదబయలు మండలానికి చెందిన గోమంగి, గుల్లెలు, బొంగరం, ఇంజెరి, లింగేటి, గిన్నెలకోట, జామిగుడ మొత్తం పది పంచాయతీలతో మద్దిగరువులో కొత్త మండలం ఏర్పాటు చేయాలి.
- పెదబయలు మండలం: ఈ మండలంలో మొత్తం 23 పంచాయతీలున్నాయి. మండలం కేంద్రం పెదబయలుకు చేరువగా ఉన్న 12 పంచాయతీలు పెదబయలు మండలంలో ఉండగా.... మిగిలిన వాటిలో నాలుగు పంచాయతీలు కొత్తగా ఏర్పడే గుత్తులపుట్టు మండలం, మరో 7 పంచాయతీలు మద్దిగరువు మండలంలో చేరతాయి.
- పెదబయలు మండలంలోని పంచాయతీలు: సీతగుంట, అడుగులపుట్టు, అరడకోట, బొండపల్లి, గలగండ, కొరవంగి, పర్రెడ, పొయిపల్లి, రూడకోట, సీకరి, లక్ష్మిపేట, వనభంగి పంచాయతీలుంటాయి.
- ముంచంగిపుట్టు మండలం: ఈ మండలంలో మొత్తం 23 పంచాయతీలున్నాయి. వాటిలో మండల కేంద్రానికి చేరువగా ఉన్న 15 పంచాయతీలు ముంచంగిపుట్టు మండలంలో ఉంచాలి. మిలిగిన 8 పంచాయతీలను కలుపుకొని జోలాపుట్టులో కొత్త మండలాన్ని ఏర్పాటు చే యాలి.
- ముంచంగిపుట్టు మండలంలోని పంచాయతీలు: కించాయిపుట్టు, ఏనుగురాయి, వనబసింగి, సుజనకోట, పెదగూడ, పనసపుట్టు, కుమడ, కిలగాడ, కరిముఖిపుట్టు, జర్రెల, జర్జుల, దారెల, బూసిపుట్టు, బరడ, బాబుసాల పంచాయతీలుంటాయి.
- జోలాపుట్టు కొత్త మండలంలోని పంచాయతీలు: జోలాపుట్టు, బరడ, బుంగాపుట్టు, దోడిపుట్టు, లక్ష్మిపురం, మాకవరం, రంగబయలు, వనుగుమ్మ పంచాయతీలు కలుస్తాయి.
- చింతపల్లి మండలం: మండలంలో 17 పంచాయతీలున్నాయి. వాటిలో 11 పంచాయతీలను, అలాగే జీకేవీఽధికి చెందిన మరో రెండు పంచాయతీలను కలిపి మొత్తం 13 పంచాయతీలతో చింతపల్లి మండలం కాగా, మిగిలిన ఆరు పంచాయతీలు, కొయ్యూరు చెందిన రెండు పంచాయతీలు, జి.మాడుగులకు చెందిన రెండు పంచాయతీలు మొత్తం 10 పంచాయతీలతో తాజంగి కేంద్రంగా మండలం ఏర్పాటు కావాలి.
- చింతపల్లి మండలంలో పంచాయతీలు: చింతపల్లి, అన్నవరం, బలపం, చౌడుపల్లి, కొమ్మంగి, కుడుముసారి, లోతుగెడ్డ, తమ్మంగుల, యర్రబొమ్మలు, బెన్నవరం, లంబసింగి పాటు, జీకేవీధి మండలానికి చెందిన జర్రెల, మొండిగెడ్డ పంచాయతీలను చేర్చాలి. దీంతో మొత్తం 13 పచాయతీలు చింతపల్లి మండల పరిధిలో ఉంటాయి.
- తాజంగి నూతన మండలంలో పంచాయతీలు: చింతపల్లి మండలంలోని తాజంగి పంచాయతీని మండల కేంద్రంగా ఏర్పాటు చేసి.. అందులో చింతపల్లికి చెందిన కొత్తపాలెం, తాజంగి, కిటుముల, గొందిపాకలు, పెదబరడ, శనివారం ఆరు పంచాయతీలతోపాటు జి.మాడుగుల మండలానికి చెందిన వంజరి, గెమ్మెలి పంచాయతీలు, కొయ్యూరు మండలానికి చెందిన మూలపేట, డౌనూరు పంచాయతీలు చేర్చాలి.
- గూడెంకొత్తవీధి మండలం: ఈ మండలంలో మొత్తం 17 పంచాయతీలున్నాయి. గూడెంకొత్తవీధి మండలాన్ని విభజించాల్సి వస్తే.. జీకేవీధిని పూర్తిగా రద్దు చేసి పెదవలస, లేదా ధారకొండ పంచాయతీలను మండల కేంద్రాలుగా ఏర్పాటు చేస్తే ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే జీకేవీధిలో ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, పోలీసు స్టేషన్ వుండడంతో కొత్త మండలాల ఏర్పాటులో లోతుగా అధ్యాయనం చేయాల్సిన అవసరం ఉంది.
- జీకేవీధి మండలంలో పంచాయతీలు: జీకేవీధి మండలం పరిధిలో జీకేవీధి, దారకొండ, దుప్పులువాడ, సీలేరు, అమ్మవారిధారకొండ, గాలికొండ, సప్పర్ల, వంచుల మొత్తం 8 పంచాయతీలను కలిపి ఉంచాలి.
- పెదవలస నూతన మండలంలో పంచాయతీలు: నూతనంగా ఏర్పాటు చేసే పెదవలస మండలంలో పెదవలస, లక్కవరపుపేట, దేవరాపల్లి, సంకాడ, అసరాడ, రింతాడ, దామనాపల్లి మొత్తం ఏడు పంచాయతీలను కలపాలి.
- కొయ్యూరు మండలం: కొయ్యూరు మండలంలో 33 పంచాయతీలున్నాయి. ఈ మండలంలో కొన్ని పంచాయతీలు నర్సీపట్నం సరిహద్దులోనూ, మరికొన్ని చింతపల్లి మండలం లంబసింగి ఘాట్ సమీపంలో ఉన్నాయి. ఈ కారణంగా ప్రజలు మండల కేంద్రానికి వెళ్లేందుకు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. దీంతో కొయ్యూరు మండలాన్ని కొయ్యూరు, కొండగోకిరి రెండు మండలాలుగా విభజిస్తే బాగుంటుంది.
- కొయ్యూరు మండలంలో పంచాయతీలు: కొయ్యూరు, బూదరాళ్ల, చీడిపాలెం,చింతలపూడి, ఎం.బీమవరం, ఎం.మాకవరం, మంప, మర్రివాడ, నల్లగొండ, రావణాపల్లి, రాజేంద్రపాలెం, రేవళ్లు, యు.చీడిపాలెంతో మొత్తం 13 పంచాయతీలు కేటాయించాలి.
- కొండగోకిరి మండలంలో పంచాయతీలు: మండలానికి చెందిన కొండగొకిరి పంచాయతీకిచుట్టూ ఉన్న 18 పంచాయతీలను కలుపుకొని కొత్త మండలం ఏర్పాటు చేయాలి. ఈ మండలం పరిధిలో కొండగోకిరి, అడాకుల, అంతాడ, బకులూరు, బాలారం, బంగారమ్మపేట, బట్టపనుకులు, చింట్టంపాడు, గదబపాలెం, కంఠారం, కినపర్తి, కొమ్మిక, నడింపాలెం, పి.మాకవరం, ఆర్.కొత్తూరు, రత్నంపేట, శరభన్నపాలెం, వెలగలపాలెం పంచాయతీలను చేర్చాల్సి వుంది. కొయ్యూరుకి చెందిన మరో రెండు పంచాయతీలు డౌనూరు, మూలపేటలను చింతపల్లి మండలంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న తాజంగి మండలంలో కలిపితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని ఆ ప్రాంతీయులు భావిస్తున్నారు.
Updated Date - Jul 31 , 2025 | 11:45 PM