ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Anitha: నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు

ABN, Publish Date - Jul 15 , 2025 | 05:40 AM

రాష్ట్రానికి బ్రాండ్‌ ఇమేజ్‌ తేవటానికి 76ఏళ్ల వయస్సులో రోజుకు 18 గంటలు కష్టపడుతున్న సీఎం చంద్రబాబు గురించి వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని...

  • సంతకానికి చేయి వణికే వారూ బాబు వయస్సుపై మాట్లాడతారా?

  • పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత ఫైర్‌

అమరావతి, జూలై 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి బ్రాండ్‌ ఇమేజ్‌ తేవటానికి 76ఏళ్ల వయస్సులో రోజుకు 18 గంటలు కష్టపడుతున్న సీఎం చంద్రబాబు గురించి వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సోమవారం అమరావతి సచివాలయంలో గంజాయి అంశంపై ఈగల్‌ డీజీ రవికృష్ణతో కలిసి హోంమంత్రి విలేకరులతో మాట్లాడారు. ‘నాయకులంటే ఇతరులకు ఆదర్శంగా ఉండాలి.. గతంలో 14ఏళ్లు, ఇప్పుడు మళ్లీ సీఎంగా ఉన్న చంద్రబాబు వయస్సుపై కామెంట్లు చేయడం ఏంటి? పొద్దున్నే షుగర్‌, బీపీ టాబ్లెట్స్‌ వేసుకుంటేనే కానీ రోజు గడవని వారు, పది సంతకాలు చేసి.. 11వ సంతకం చేయాలంటే చేయి వణికే వారు కూడా చంద్రబాబు వయస్సు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. వైఎస్సార్‌ అలా చనిపోతారని ఎవరైనా అనుకున్నారా? ఏం మాడ్లాడుతున్నారు? మాట్లాడ్డం మాకు చేతగాదనుకుంటున్నారా? మాకంటూ ఒక బాధ్యత ఉంది. మీరనే మాటలకు మేం ప్రతీకారాలు చేసుకుంటూ పోతే.. మిమ్మల్ని ఎలా చూశారో మమ్మల్నీ అలానే చూస్తారు ప్రజలు. కాబట్టి మా పని మేం చేసుకుంటున్నాం.అలాగని నోటికొచ్చినట్లు తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు’ అని హెచ్చరించారు. రాష్ట్రంలో డ్రగ్స్‌, గంజాయి తయారీ, అమ్మకం, రవాణా చేసే వారితో పాటు సేవించే వారిపై ‘ఈగల్‌’ కన్ను ఉంటుందని అనిత అన్నారు.నేరస్థుడి విషయంలో ఎవరైనా ఒక్కటేనని, చివరికి పోలీసుల పాత్ర ఉన్నా వారిపైనా చర్యలుంటాయని స్పష్టం చేశారు.

రప్పారప్పా అంటే తప్పేందని అంటున్న వారిని ప్రజలు నిలదీయాలని సూచించారు. శ్రీకాళహస్తి జనసేన నాయకురాలి డ్రైవర్‌ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈగల్‌ డీజీ రవికృష్ణ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్‌ వాడే వారు, అమ్మే వారి వివరాలతో త్వరలో డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈగల్‌లో 459 మంది సిబ్బందే ఉన్నా..ఐదు కోట్ల రాష్ట్ర ప్రజలూ సభ్యులేనని స్పష్టం చేశారు. ఆపరేషన్‌ గరుడ 2 త్వరలో మొదలవుతుందన్నారు.మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు తల్లిదండ్రులు, అధ్యాపకులు అవగాహన కల్పించాలని, ఎవరైనా గంజాయి, డ్రగ్స్‌ వాడినా, అమ్మినా 1972కు సమాచారం ఇస్తే.. 24గంటలు ఈగల్‌ సిబ్బంది అందుబాటులో ఉండి,చర్యలు తీసుకుంటారని చెప్పారు.

Updated Date - Jul 15 , 2025 | 05:40 AM