హై-గ్లో ల్యాబ్ ఆన్ వీల్స్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు
ABN, Publish Date - Mar 13 , 2025 | 01:45 AM
రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో గత ఏడాది ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబడిన హై-గ్లో ల్యాబ్ ఆన్ వీల్స్ కార్యక్రమానికి జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది.
రాజమహేంద్రవరం అర్బన్, మార్చి12(ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో గత ఏడాది ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబడిన హై-గ్లో ల్యాబ్ ఆన్ వీల్స్ కార్యక్రమానికి జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. పబ్లిక్ అడ్మినిస్ట్టేషన్ -2024లో హై-గ్లో ల్యాబ్ ఆన్ వీల్స్ కోసం ప్రైమ్‌మినిస్టర్స్ అవార్డ్స్ ఫర్ ఎక్స్‌లెన్సీ కోసం పోర్టల్‌లో సమర్పించబడిన ఆన్‌లైన్ అప్లికేషన్‌కు సంబంధించి జిల్లా నుంచి పంపిన ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి బుధవారం ఢిల్లీలోని ఎలక్ర్టానిక్స్ నికేతన్‌లో స్ర్కీనింగ్ కమిటీ ఎదుట పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుత విద్యాసంవత్సరం 2024-25కుగాను ప్రధానమంత్రి ప్రకటిం చే అవార్డుల్లో ఇన్నోవేషన్ కేటగిరీలో జిల్లాస్థాయి నుంచి హై-గ్లో ల్యాబ్ ఆన్ వీల్స్ ప్రాజెక్టు ఎంపిక కాగా, రాష్ట్రస్థాయిలో ఈ ప్రాజెక్టు తొలిసారిగా ఎంపికై జాతీయస్థాయికి చేరుకోవడం హర్షదాయకమని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వపాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను గొప్ప శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఈ ఆలోచన సరైనదిగా ఉంటుందని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించినట్టు కలెక్టర్ వెల్లడించారు.
Updated Date - Mar 13 , 2025 | 01:46 AM