ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Andhra Pradesh: సామాన్యులకు ‘మరుగు’ లేదా!

ABN, Publish Date - Apr 24 , 2025 | 05:43 AM

రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయంలో మరుగుదొడ్లు లేకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పరిష్కారం కనుగొనాలని ఆదేశిస్తూ, మరుగుదొడ్లు లేకుంటే కార్యాలయాన్ని మరో భవనానికి మార్చాలని సూచించింది.

ప్రజలకు శౌచాలయం లేకుండా సమాచార కమిషనరేట్‌ నిర్వహణపై హైకోర్టు విస్మయం

పరిశీలించి పరిష్కరించాలని సీఎ్‌సకు ఆదేశం

అమరావతి, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సమాచార కమిషన్‌ కార్యాలయంలో సామాన్య ప్రజల కోసం మరుగుదొడ్డి లేకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. మరుగుదొడ్డి లేకుండా కార్యాలయం నిర్వహించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్ని వ్యక్తిగతంగా పరిశీలించి పరిష్కారం కనుగొనాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ను ఆదేశించింది. సమస్య పరిష్కారం కాకుంటే ఆన్‌లైన్‌ ద్వారా సీఎస్‌ హాజరుకు ఆదేశిస్తామని హెచ్చరించింది. అద్దె భవనంలో కార్యాలయం కొనసాగుతున్న నేపధ్యంలో మరుగుదొడ్డి ఏర్పాటు వీలుకాకుంటే తక్షణం కార్యాలయాన్ని మరో భవనానికి మార్చాలని సూచించింది. విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్ర సమాచార కమిషన్‌ కార్యాయలయంలో కనీస మౌలికవసతులు కల్పించడంతో పాటు కార్యాలయాన్ని సందర్శించే సాధారణ ప్రజానీకం కోసం మరుగుదొడ్లు ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సమాచార కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ న్యాయవాది బి.క్రాంతికుమార్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది అభినవ్‌ కృష్ణ వాదనలు వినిపిస్తూ.... కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకు తప్ప సామాన్య ప్రజలకు మరుగుదొడ్లు లేవన్నారు. మరుగుదొడ్డి ఏర్పాటు విషయంలో భవన యజమానితో వివాదం కొనసాగుతోందన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ) ఎస్‌.ప్రణతి స్పందిస్తూ.. భవన యాజమానితో వివాదం వాస్తవమేనన్నారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం ఇవ్వాలని అభ్యర్ధించారు. ధర్మాసనం స్పందిస్తూ... మరుగుదొడ్డి ఏర్పాటుకు అనుమతులు లేకుంటే యజమాని ఏమి చేయగలరని ప్రశ్నించింది.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 24 , 2025 | 05:43 AM