ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

High Court ruling: ఖాళీల భర్తీపై ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయలేం

ABN, Publish Date - Apr 03 , 2025 | 04:39 AM

రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖాళీల భర్తీకి ఒత్తిడి చేయలేమని హైకోర్టు పేర్కొంది. ఇది ఆర్థికపరమైన అంశమని స్పష్టం చేసింది. 2022 వరకు ఉన్న ఎస్‌ఐ బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేశామని, మిగిలిన ఖాళీలు తదుపరి నోటిఫికేషన్‌లో భర్తీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.

ఇది ఆర్థికపరమైన అంశాలతో ముడిపడిన వ్యవహారం: హైకోర్టు

2022 వరకు ఉన్న ఎస్‌ఐ బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేశాం: ఏఏజీ

అమరావతి, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇది పూర్తిగా ఆర్థికపరమైన అంశాలతో ముడిపడిన వ్యవహారమని పేర్కొంది. 2022 వరకు ఉన్న ఎస్‌ఐ బ్యాక్‌లాగ్‌ పోస్టులు అన్నింటినీ భర్తీ చేశామని, ఆతర్వాత ఏర్పడిన ఖాళీలను తదుపరి నోటిఫికేషన్‌లో భర్తీ చేస్తామని ప్రభుత్వం చెబుతోందని ధర్మాసనం గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో పిల్‌పై విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ విచారణను మూసివేసింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు చెందిన 246 ఎస్‌ఐ బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఐటీడీఎస్‌ కార్యనిర్వాహక సభ్యుడు అనుముల వంశీకృష్ణ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా ప్రభుత్వం తరఫున అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ సాంబశివ ప్రతాప్‌ వాదనలు వినిపించారు.


ఇవి కూడా చదవండి:

FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..

Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..

Updated Date - Apr 03 , 2025 | 04:39 AM