AP Govt : రీ సర్వేపై సందేహాలా? 8143679222కు ఫోన్ చేయండి
ABN, Publish Date - Jan 24 , 2025 | 03:55 AM
రాష్ట్రంలో భూముల రీ సర్వే పైలెట్ ప్రాజెక్టు అమలవుతోన్న గ్రామాల్లో రైతుల సందేహాల నివృత్తి కోసం...
రీ సర్వే సందేహాల నివృత్తికి హెల్ప్ లైన్ నంబరు
పనిదినాల్లో 8143679222కు కాల్ చేయండి
అమరావతి, జనవరి 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూముల రీ సర్వే పైలెట్ ప్రాజెక్టు అమలవుతోన్న గ్రామాల్లో రైతుల సందేహాల నివృత్తి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ నంబరు ఏర్పాటు చేసింది. రైతులకు సందేహాలు, సమస్యలు ఉంటే పని రోజుల్లో ఉదయం 10 నుంచి సాయత్రం 5.30 గంటల వరకు 8143679222 నంబరును సంప్రదించాలని అదనపు సీసీఎల్‌ఏ, సర్వే శాఖ డైరెక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఈనెల 20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 627 గ్రామాల పరిధిలో రీ సర్వే పైలెట్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. దానిపై ఎన్.ప్రభాకర్‌రెడ్డి గురువారం ఓ ప్రకటన చేస్తూ... ‘రీ సర్వే సందర్భంలో యజమానులు భూమి వద్దకు వచ్చి హద్దులు చూపించేందుకు మూడుసార్లు అవకాశం కల్పిస్తాం. అప్పటికీ రైతులు రాకపోతే వీడియోకాల్ ప్రక్రియ ద్వారా హద్దుల ఖరారు ప్రక్రియను పూర్తిచేస్తాం’ అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Fog Effect: గన్నవరం ఎయిర్‌పోర్టుకు రావలసిన పలు విమానాలు ఆలస్యం
Lokesh Visit Davos: అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయండి: మంత్రి లోకేష్
Read Latest AP News And Telugu News
Updated Date - Jan 24 , 2025 | 03:56 AM