ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Andhra Pradesh weather: మళ్లీ భగభగ పెరిగిన ఎండ తీవ్రత

ABN, Publish Date - Jun 02 , 2025 | 06:01 AM

రుతుపవనాల ప్రభావంతో వర్షాలు తగ్గడంతో రాష్ట్రంలో మళ్లీ ఎండల తీవ్రత పెరిగింది. అయితే, రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

జంగమహేశ్వరపురంలో 41 డిగ్రీలు నమోదు

విశాఖపట్నం, అమరావతి, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి) నైరుతి రుతుపవనాల విస్తరణ తర్వాత రెండు, మూడు రోజులు కురిసిన వర్షాలు ఆదివారం తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఆకాశం నిర్మలంగా మారింది. దీనికితోడు పడమర దిశ నుంచి పొడిగాలులు వీయడంతో ఒక్కసారిగా ఎండ, వేడి వాతావరణం పెరిగింది. పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. జంగమహేశ్వరపురంలో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

నేడు తేలికపాటి వర్షాలు..

రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని, ఎండతీవ్రత కొనసాగుతుందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. కాగా, సోమవారం అల్లూరి, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.


ఇవీ చదవండి:

చర్చలంటూ జరిగితే పీఓకే పైనే

పక్కా ప్లాన్ ప్రకారమే హత్యలు

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 02 , 2025 | 06:01 AM