ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆరోగ్య‘యోగ’ం

ABN, Publish Date - Jun 04 , 2025 | 12:28 AM

యోగాంధ్రలో భాగంగా జిల్లా అధికార యంత్రాయం రోజుకో రూపంలో యోగాసనాల కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

యోగా చేస్తున్న వివిద శాఖల అధికారులు, ప్రజలు

రాతి వనాలపై యోగాసనాలు

రాక్‌ గార్డెన్సకు భారీగా తరలివచ్చిన ప్రజలు

వినూత్నంగా ఆలోచించిన అధికారులు

ఓర్వకల్లు, జూన 3 (ఆంధ్రజ్యోతి): యోగాంధ్రలో భాగంగా జిల్లా అధికార యంత్రాయం రోజుకో రూపంలో యోగాసనాల కార్యక్రమాలను నిర్వహిస్తోంది. నెల రోజుల పాటు జరిగే ఈ యోగాంధ్ర వేడుకలను మంగళవారం సహజ సిద్ధంగా ఏర్పడిన రాతి వనాలపై నిర్వహించారు. ఓర్వకల్లు మండలంలోని పర్యాటక కేంద్రం రాక్‌ గార్డెన్సలో సూర్యోదయ వేళ... కలెక్టర్‌ రంజిత బాషాతో పాటు ఎమ్మెల్యే గౌరు చరిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కర్నూలు నగరంతో పాటు ఓర్వకల్లు మండలంలోని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆసనాలు వేశారు. యోగా అభ్యసన విద్యార్థులతో పాటు ట్రైనర్స్‌, మాస్టర్‌ ట్రైనర్స్‌ వివిధ భంగిమల్లో యోగాసనాలు వేసి అబ్బురపరిచారు. రాక్‌ గార్టెన్సలో ఉన్న పెద్ద బండరాళ్లపై వినూత్న రీతిలో యోగాసనాలు వేస్తూ ‘యోగాంధ్ర’ కీర్తిని చాటి చెప్పారు.

యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా జిల్లా పర్యాటక శాఖ టూరిజం కార్పొరేషన డైరెక్టర్‌ ముంతాజ్‌ బేగ్‌, డివిజనల్‌ మేనేజర్‌ లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో ఓర్వకల్లులోని రాక్‌గార్డెన వద్ద నిర్వహించిన యోగా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో దాదాపు వేయి మంది యోగా అభ్యాసకులు పాల్గొని యోగాసనాలు చేశారు. వీరికి మాస్టర్‌ ట్రైనర్లు యోగాసనాలపై అవగాహన, శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జిల్లా కలెక్టర్‌ పి.రంజిత బాషా, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ డా.బి.నవ్య హాజరయ్యారు. యోగాసనాలను వీక్షించేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రాతివనాల్లోని కొండలపై కూర్చుని తిలకించారు. పొదుపులక్ష్మి మండల ఐక్య సంఘం ఆధ్వర్యంలో ప్రజలకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. కొండల్లో యోగాసనాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రాష్ట్ర యోగా సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్‌ శెట్టి, యోగా గురువులు మునిస్వామి, విజయకుమార్‌ ఆధ్వర్యంలో యోగా ప్రోటోకాల్‌ ప్రకారం దాదాపు గంట పాటు యోగాసనాలు చేయించారు. ఈ కార్యక్రమంలో మండల సమైఖ్య గౌరవసలహాదారాలు విజయభారతి, జాయింట్‌ కలెక్టర్‌ బి.నవ్య, టూరిజం కార్పొరేషన డైరెక్టర్‌ ముంతాజ్‌ బేగ్‌, కర్నూలు ఆర్డీవో సందీప్‌ కుమార్‌, జడ్పీ సీఈవో నాసరరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసులు, తహసీల్దార్‌ విద్యాసాగర్‌, ఆయూష్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ప్రసాద్‌, టీడీపీ నాయకులు గోవిందరెడ్డి, మోహన రెడ్డి, చదువుల సుధాకర్‌ రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, సుధాకర్‌రావు, ఏపీ టూరిజం యూనిట్‌ మేనేజర్‌ జీవన, వ్యాక్యాత డాక్టర్‌ మద్దకంటి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

దినచర్యలో భాగం కావాలి

- రంజిత బాషా, కలెక్టర్‌, కర్నూలు

దినచర్యలో యోగా ఒక భాగంగా మారితే.. ఇంటిల్లిపాదికి ఆనందం, ఆరోగ్యభాగ్యం సొంతమవుతుంది. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జూన 21న నిర్వహిస్తున్న ప్రపంచ యోగా దినోత్సవంలో కర్నూలు జిల్లాలో 10 లక్షల మంది పాల్గొనే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. యోగాంధ్రలో భాగంగా ఇప్పటికే ట్రైనర్లకు శిక్షణా కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం గ్రామ స్థాయిలో పోటీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాల్లో యోగా నిర్వహించాలనే థీమ్‌లో భాగంగా ఓర్వకల్లు రాక్‌గార్డెన వద్ద యోగా కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. జూన 12న కొండారెడ్డి బురుజు వద్ద, 18న మంత్రాలయంలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తాం. 5వేల మంది పారిశుధ్య కార్మికులతో జూన 17న కర్నూలులో యోగా కార్యక్రమం నిర్వహించేలా ప్లాన చేశాం.

యోగా కోసం సమయాన్ని కేటాయించండి

- గౌరు చరిత, ఎమ్మెల్యే, పాణ్యం

ప్రతి ఒక్కరూ రోజులో కొంత సమయాన్ని యోగా కోసం కేటాయించండి. యోగాతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. యోగా గురించి దేశప్రజలందరికీ తెలియజేస్తూ, అందరినీ యోగాలో భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ‘యోగాంధ్ర’కు శ్రీకారం చుట్టారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా జూన 21న వైజాగ్‌లో నిర్వహించనున్న యోగా దినోత్సవం కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హాజరవుతారు.

Updated Date - Jun 04 , 2025 | 12:28 AM