ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Health department: దారితప్పిన వైద్యులపై చర్యలు

ABN, Publish Date - Apr 26 , 2025 | 05:38 AM

విధుల్లో నిర్లక్ష్యం, లంచాలు, తప్పు హాజరుతో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు ప్రభుత్వ వైద్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. ఎలూరు, గుడివాడ, ఎమ్మిగనూరు, నెల్లూరు ప్రాంతాల్లో సంబంధిత వైద్యులపై ఏసీబీ విచారణలు కొనసాగుతున్నాయి.

ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ ఆదేశం

ఏసీబీ ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిర్ధారణ

అమరావతి, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): దారితప్పి వ్యవహరించారని ఆరోపణలొచ్చిన ఆరుగురు ప్రభు త్వ వైద్యులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ ఆదేశించారు. విధులకు హాజరు కాకుండా వచ్చినట్లు రిజిస్టర్లలో సంతకం చేయడం, లంచాలు తీసుకుని వైకల్య ధ్రువపత్రాలు జారీ చేయడంతో పాటు విధుల్లో నిర్లక్ష్యం వహించి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారని పలువురు వై ద్యులపై ఆరోపణలొచ్చాయి. దీనిపై మంత్రి ఏసీబీ విచారణకు ఆదేశించారు. గుడివాడలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఇందిరాదేవి ఆస్పత్రికి రాకుండా హాజరు రిజిస్టర్లలో సంతకాలు చేస్తున్నారంటూ ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదును డీసీహెచ్‌ ఉన్నతాధికారులు పరిశీలించారు. గతేడాది జనవరి-మార్చి కాలంలో ఆమె 22రోజులు ఆస్పత్రికి రాలేదని తేలింది. ఆయా రోజుల్లోనూ ఆమె రిజిస్టర్‌లో సంతకాలు చేయడంతో పాటు ముఖ ఆధారిత హాజరు కూడా నమోదు చేశారు.


అయితే ఆ సమయంలో ఆమె ఒకరోజు మచిలీపట్నంలో, 8 రోజులు తణుకులో, 13 రోజులు విశాఖపట్నంలో ఉన్నట్లు వెల్లడైంది. ఇందిరా దేవిపై చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఎమ్మిగనూరు ఏరియా ఆస్పత్రిలో సివిల్‌ సర్జన్‌ స్పెషలి్‌స్టగా పనిచేస్తున్న సుధ 2022 ఫిబ్రవరి నుంచి ఏడాది పాటు అనుమతులు తీసుకోకుండా విధులకు దూరంగా ఉన్నారు. దీనికి సంబంధించి హేతుబద్ధమైన కారణాలు చూపనందున విచారణకు మంత్రి ఆదేశించారు. కాగా, దివ్యాంగులకు వైక్యల ధ్రువపత్రాలు జారీ చేసేందుకు రూ.10వేల నుంచి రూ.25వేలు లంచం తీసుకుంటున్నట్లు ఏలూరు ప్రభుత్వాస్పత్రి వైద్యులపై వచ్చిన ఫిర్యాదులపై ఏసీబీ విచారణ జరిపింది. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు ఎన్‌.రాజేంద్రప్రసాద్‌, టి. రామమోహన్‌రావు, స్వర్ణ శ్రీనివాసులుకు భారీ జరిమానా విధించి, శాఖాపరమైన విచారణ చేపట్టనున్నారు. కాగా, నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఆరోగ్యాధికారిగా ఉంటున్న డాక్టర్‌ పి.వెంకటరమణయ్య కార్పొరేషన్‌కు రావాల్సిన రూ.12కోట్ల ఆదాయం వసూలు విషయం లో నిర్లక్ష్యం వహించారని ఏసీబీ నివేదిక ఇచ్చింది.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 26 , 2025 | 05:38 AM