Health Department Transfers: మూడేళ్లు దాటితే బదిలీ తప్పనిసరి
ABN, Publish Date - May 28 , 2025 | 06:14 AM
ఆరోగ్యశాఖ మూడేళ్ల సర్వీసు పూర్తిచేసిన పాలనా సిబ్బందిని తప్పనిసరిగా బదిలీ చేయాలని నిర్ణయించింది. అవినీతిని తగ్గించేందుకు ఈ కొత్త బదిలీ నిబంధనలు సీఎం చంద్రబాబు ఆమోదించారు.
రెండేళ్లు సర్వీస్ దాటితేనే ట్రాన్స్‌ఫర్లకు అర్హత
ఆరోగ్యశాఖ ప్రతిపాదనలకు సీఎం ఆమోదం
అమరావతి, మే 27 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక శాఖ విధానాల ప్రకారం ఒకేచోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలన్న నిబంధనను సడలిస్తూ, ఒకేచోట మూడేళ్ల సర్వీసు పూర్తి చేసిన పాలనా సిబ్బందిని తప్పనిసరిగా బదిలీ చేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అలాగే, రెండేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారికి మాత్రమే బదిలీలకు అర్హత కల్పించింది. ఆర్థిక శాఖ విధానాల ప్రకారం సర్వీసు కాలంతో సంబంధం లేకుండా ఎవరైనా బదిలీ కోరవచ్చు. కానీ ప్రత్యేక అవసరాల మేరకు ఆరోగ్యశాఖ ఈ రెండేళ్ల కనీస సర్వీసు నిబంధన తీసుకుంది. ఈ మేరకు ఆరోగ్యశాఖ పరిధిలో ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను సీఎం చంద్రబాబు ఆమోదించారు. క్షేత్రస్థాయిలో రీజనల్ డైరెక్టర్లు, డీఎంహెచ్‌వోలు, డీసీహెచ్‌ఎ్‌సల కార్యాలయాలతో పాటు ప్రిన్సిపాళ్లు, ఆసుపత్రుల సూపరింటెండెంట్ల కార్యాలయాల్లో సంవత్సరాలుగా పని చేస్తున్న కిందస్థాయి పాలనా సిబ్బందిపై పలు అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీన్ని అరికట్టడానికి ఆరోగ్యశాఖ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కాగా, డీఎంఈ పరిధిలో ఉండే ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో ఎన్‌ఎంసీ నిబంధనల మేరకు ఉన్న ఖాళీలనే ప్రకటించి బదిలీల్లో వాటిని భర్తీ చేస్తారు. 20 రోజుల్లోగా బదిలీల ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. వివిధ ఉద్యోగ సంఘాల్లో బాధ్యతలు నిర్వహిస్తూ ఒకేచోట మూడేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న సిబ్బందిని అదే స్టేషన్లోనే వేరొక కార్యాలయానికి బదిలీ చేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే
అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్
Read Latest AP News And Telugu News
Updated Date - May 28 , 2025 | 06:14 AM