ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

COVID 19: ప్రమాదం లేదు.. అయినా జాగ్రత్త

ABN, Publish Date - May 26 , 2025 | 03:01 AM

ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్యశాఖ కమిషనర్‌ వీరపాండియన్‌ కరోనా కేసులపై అప్రమత్తంగా ఉండి, నిఘా వేయమని ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలోని ఆసుపత్రులు ఆక్సిజన్‌, పరీక్ష కిట్లు, ఐసోలేషన్ గదులను సిద్ధం చేసుకుని, పరిస్థితిని సమయానుకూలంగా రిపోర్ట్ చేయాలని సూచించారు.

కొవిడ్‌పై అప్రమత్తంగా ఉండాలి

ఆరోగ్యశాఖలో హెచ్‌వోడీలకు కమిషనర్‌ లేఖ

అమరావతి, మే 25 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌-19పై అప్రమత్తంగా ఉండాలని, కేసుల నమోదును నిశితంగా పరిశీలించాలని ఆరోగ్యశాఖ కమిషనర్‌ వీరపాండియన్‌ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్యశాఖ పరిధిలోని హెల్త్‌ డైరెక్టర్‌, డీఎంఈ, సెకండరీ హెల్త్‌ డైరెక్టర్లను అప్రమత్తం చేస్తూ ఆదివారం లేఖ రాశారు. రాష్ట్రంలో కొవిడ్‌ కేసు నమోదు కావడంతో ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ సమీక్ష చేసిన అనంతరం తీసుకున్న నిర్ణయాలను లేఖలో పొందుపరిచారు. ‘కొవిడ్‌ కేసుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక మార్గదర్శకాలు విడుదల చేయలేదు.. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది.. కేసుల ప్రాబల్యంపై నిశిత పర్యవేక్షణ జరుగుతోంది.. భయపడాల్సిన అవసరంలేదు’ అని లేఖలో పొందుపరిచారు. మరోవైపు రాష్ట్రంలో ఏ ఆస్పత్రిలోనూ అధికంగా జ్వరం కేసులు పెరగలేదని, అక్కడక్కడ కొవిడ్‌ కేసులు మాత్రమే నమోదవుతున్నాయని తెలిపారు.


రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల అధికారులు, సూపరింటెండెంట్లు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, జ్వరం, గొంతునొప్పి కేసుల నమోదైనా, ఎక్కువగా కేసులు వచ్చినా వెంటనే ఆరోగ్యశాఖ కమిషనర్‌, హెల్త్‌ డైరెక్టర్‌ తెలిచేయాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌, పరీక్ష కిట్లు, మందులు, పీపీఈ కిట్లు, ఎన్‌95 మాస్క్‌లు, ఐసొలేషన్‌ గదులను సిద్ధం చేసుకోవాలని సూచించారు. పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని, సిబ్బందిని అప్రమత్తం చేయాలని ఆదేశించారు. అలాగే, హెల్త్‌ డైరెక్టర్‌ 21వ తేదీన ఇచ్చిన మార్గదర్శకాలను ఉపసంహరిస్తున్నట్లు తెలిపారు. డీఎంహెచ్‌వోలు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ ఉండాలని, కేసులు నమోదైన వెంటనే సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని ప్రోటోకాల్‌ ప్రకారం తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అందువల్ల కొవిడ్‌ 19 పర్యవేక్షణపై సమయానికి రిపోర్టు చేయాలని ఆరోగ్యశాఖ మిగిలిన విభాగాల పరిధిలో ఉన్న హెచ్‌వోడీలు, సూపరింటెండెంట్లకు మార్గదర్శకాలు జారీ చేయాలని ఆదేశించారు.


ఇవి కూడా చదవండి

Minister Satyakumar: 2047 నాటికి ప్ర‌పంచంలో రెండో స్థానానికి భార‌త్ ఎద‌గ‌డం ఖాయం

Transgenders: డబ్బులు అడగొద్దన్నందుకు.. నడిరోడ్డులో పోలీస్‌పై ట్రాన్స్‌జెండర్ల దారుణం..

Indian Delgation in Japan: ఉగ్రవాదం రాబిడ్ డాగ్‌, దాని నీచమైన నిర్వాహకుడు పాక్‌.. నిప్పులు చెరిగిన అభిషేక్

India slams Pak: ప్రసంగాలు ఆపండి.. UN లో పాక్‌పై విరుచుకుపడిన భారత్..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 26 , 2025 | 03:02 AM